Monday, July 20, 2020

A telugu moral story about father and son.

"నాన్నా! రేపు మా తరగతిలో పిల్లలంతా పరీక్ష ఫీజు చెల్లించాలని హెడ్ మాస్టర్ చెప్పారు" 

ఇంట్లోకి అడుగు పెడుతూనే అన్నాడు రఘు. అప్పుడే కూలిపని ముగించుకుని ఇంటికి వచ్చిన కేశవులు కొడుకు మాటలు విని 'అలాగా! ఫీజు ఎంత ఏంటి? అని అడిగాడు.

రెండు వందలని మెల్లగా చెప్పాడు రఘు.
"అవునా! రెండు వందలా ఈసారి బాగా పెంచేశారు , సర్లే రేపు బడికి వెళ్లే టప్పుడు ఇస్తాను" అంటూ పెరట్లోకి నడిచాడు కేశవులు.
మరుసటి రోజు ఉదయం రఘు బడికి వెళ్లేందుకు తయారవుతుండగా 'ఇదిగోరా రెండువందలు, జాగ్రత్త మరి , వెళ్లినవెంటనే టీచర్ కి ఇవ్వు' అని జేబులో పెట్టాడు. సరే నాన్న అంటూ బయటకు నడిచాడు రఘు. రఘు కాస్త దూరం నడవగానే అతని స్నేహితుడు అమర్ ఎదురయ్యాడు.
ఏరా మీ నాన్న ఫీజు డబ్బులు ఇచ్చారా ? ఆతృతగా అడిగాడు అమర్.
ఇచ్చారురా మరి , మీ నాన్న ? అమర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు రఘు.
నేను ఫీజు రెండువందల యాభై రూపాయలు అని చెప్తే మారు మాటాడకుండా ఇచ్చేసారరా మా నాన్న, గొప్పగా చెప్పాడు అమర్.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు చెల్లించవలసిన ఫీజు వంద రూపాయలే. తమ తల్లిదండ్రులనుంచి ఎక్కువ డబ్బు తీసుకుని వాటితో సినిమాకు వెళ్లాలని పథకం వేసుకున్నారు.ఇద్దరిది ఒకే తరగతి, ఒకే బెంచీలో కూర్చుంటారు, కలిసి తిరుగుతుంటారు. తల్లిదండ్రుల్ని నమ్మించి భలేగా డబ్బులు తీసుకున్నామని ఇద్దరూ మురిసిపోయారు. చెరో వంద వారి తరగతి ఉపాధ్యాయుడికి ఫీజు చెల్లించారు.
మరునాడు ఆదివారం కావడంతో ఇద్దరూ ఆడుకోవడానికి అని ఇంట్లో చెప్పి టౌనుకు బయలుదేరారు. సినిమా చూసి, ఆ తరువాత మిఠాయి దుకాణానికి వెళ్లి తమకు ఇష్టమైన తినుబండారాలు ఎన్నో కొనుక్కుని తిన్నారు. ఆనందంగా గడిపారు, చీకటిపడే వేళకు ఇంటికి చేరుకున్నారు. రఘు ఆట నుంచి ఇంటికి వస్తున్నట్టు నమ్మించేందుకు ఒక క్రికెట్ బాట్ చేతిలో పట్టుకుని నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అదే సమయంలో పక్క గదిలో తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు విని ఆగిపోయాడు.
కిటికీలోంచి లోపలకు చూసాడు, వాళ్ల నాన్న మంచం మీద జ్వరంతో వనికిపోతూ ఉన్నాడు. అతని భార్య సపర్యలు చేస్తూ " వచ్చిన డబ్బులన్ని పిల్లాడు ఫీజు కోసం ఇచ్చేశావ్, మందులు తెద్దామంటే ఇంట్లో రూపాయి కూడా లేదు" అంది.
అందుకు కేశవులు సమయానికి ఫీజు కట్టకపోతే రఘుని పరీక్షలకు అనుమతించరు. నాకు మాములు జ్వరమెగా వచ్చింది రేపటికి తగ్గిపోతుందిలే అన్నాడు మూలుగుతూ
అలా అంటే ఎలా నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఒక యాభై రూపాయలు అడిగి మందులు కొని తెస్తాను, అంటూ లేవబోయిన ప్రమీల చేయి పట్టుకుని ఆపి వద్దు రేపు చూద్దాంలే ఇప్పుడు అప్పు చేయడం ఎందుకు అన్నాడు కేశవులు.
అదంతా చూస్తున్న రఘుకు బాధగా అనిపించింది. తన విలాసాల కోసం ఖర్చు చేసిన వంద రూపాయలు ఎంత విలువైనవో తెలిసి వచ్చింది. అది కాక రోజు వారి కూలికి వెళ్లి సంపాదించే తన తండ్రి శ్రమ విలువని అర్థం చేసుకోలేకపోయానని బాధ పడ్డాడు. తన ఫీజుకోసం ఉన్న డబ్బులన్ని ఇచ్చిన తండ్రి మంచితనాన్ని తలుచుకోగానే దుఃఖం తన్నుకు వచ్చింది.
గదిలోకి పరుగున వెళ్లి తండ్రిని అమాంతం కౌగిలించుకున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిన సంగతంతా చెప్పాడు. తప్పును క్షమించమని విలపించాడు. వాస్తవాన్ని చెప్పినందుకు రఘుని తల్లిదండ్రులు కోపగించుకోలేదు.
పైగా "చూడు రఘు! నువ్వే మా సర్వస్వం. నీకోసం, నీ చదువు కోసం ఏమైనా చేస్తాం. నువ్వు మాలా కూలి బ్రతుకు బ్రతకకూడదన్నదే మా కోరిక. జరిగింది మరిచిపో , ఇక మీద నీకేం కావాలన్న సంకోచం లేకుండా మమ్మల్ని అడుగు మేము తెచ్చిపెడతాం. మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకు, అంటూ అక్కున చేర్చుకున్నారు.
ఆ ఘటన రఘులో గొప్ప మార్పు తెచ్చింది. ఎప్పుడూ #మంచి_ప్రవర్తనతో మెలుగుతూ , తన మిత్రుడిలోనూ అలాంటి పరివర్తన తీసుకొచ్చాడు.

A successful story about post man awarded by Padmashri Award.

పద్మశ్రీకి అర్హుడే : 30ఏళ్లుగా దట్టమైన అడవిలో రోజూ 15 కి.మీ నడిచి వెళ్లి ఉత్తరాలు డెలివరీ చేసిన పోస్టుమ్యాన్

దట్టమైన అడవి.. అందులో క్రూర మృగాలు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదు. ఇక మనిషి తప్పిపోయి ఒక్కసారి అడవిలోకి వెళితే వస్తాడో రాడో కూడా తెలియదు. అలాంటి అడవి గుండా 30 ఏళ్లుగా ఓ పోస్టుమ్యాన్‌ నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాలకు ఉత్తరాలు అందించాడు. ఆ పోస్టుమ్యాన్ దట్టమైన అడవి ప్రాంతంలో 15 కిలోమీటర్లు నడుస్తూ అందరి మన్ననలను పొందాడు.

తమిళనాడుకు చెందిన పోస్ట్‌మాన్ డీ శివన్ పోస్టల్ శాఖలో పోస్టుమ్యాన్‌గా చేరినప్పటి నుంచి ఉద్యోగ విరమణ చెందేవరకు దాదాపు 30 ఏళ్ల పాటు దట్టమైన అడవి ప్రాంతంలో రోజూ ఏనుగులు, ఎలుగుబంట్లను దాటుకుంటూ జారే ప్రవాహాలు, జలపాతాలను అధిగమించి 15 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఉత్తరాలు, పెన్షన్ సొమ్ము పంచి వచ్చేవాడు. శివన్ ఎక్కువగా నీలగిరి పర్వతాలు, రైల్వే ట్రాక్‌ల వెంట నడుస్తూ వెళ్లి వచ్చేవాడు. కూనూర్ సమీపంలోని హిల్‌గ్రోవ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ట్రెక్కింగ్ సమీప ప్రాంతాల్లో నివసించే తోటల కార్మికులకు ఉత్తరాలు, పెన్షన్లు పంపిణీ చేసేందుకు పోస్టుమ్యాన్ శివన్ వెళ్లాల్సి వచ్చేది. రిమోట్ ప్రాంతాల్లో పనిచేస్తుండడంతో సొరంగాలు, అటవీ ప్రాంతాల మీదుగా నడిచేవారు.
ఈ క్రమంలోనే తరచూ అడవి జంతువులను శివన్ ఎదుర్కొనేవాడు. కొన్ని సందర్భాల్లో అతడిని ఏనుగులు, ఎలుగుబంట్లు వెంబడించి తరిమిన సంఘటనలు ఉన్నాయి. ఆయన బెదరకుండా 30 ఏళ్లుగా అదే అడవి గుండా నడుచుకుంటూ వెళ్లీ తన విధులను నిర్వర్తించాడు.
ఇలా 30 ఏండ్ల పాటు తపాలా సేవలందించిన శివన్‌ గతవారం రిటైర్ అయ్యారు. అయితే పోస్ట్‌మాన్‌గా శివన్ అంకితభావం గురించి తెలుసుకున్న ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ విషయాన్ని బుధవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంకిత భావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన శివన్‌ను ప్రశసింస్తూ ఐఏస్‌ అధికారి సుప్రియా సాహు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
నిబంద్ధతతో, అంకిత భావంతో పనిచేసిన శివన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తూ పదవి విరమణ శుభకాంక్షలు తెలుపుతున్నారు. అతడు నిజమైన హీరో అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. దేశ నిర్మాణంలో అతని పాత్ర చాలా ప్రశంసించబడింది. అతని నిబద్ధతకు అభినందనలు. అతను పద్మ పురస్కారానికి అర్హుడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. శివన్ ఇకపై ఆనందకర జీవితాన్ని గడపాలని వారు ఆకాంక్షించారు.

Telugu Moral story about hunter - a moral story telugu

సంతృప్తి : ఒక మంచి కథ 

ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్ళాడు.

గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు. చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు.

ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు. టోపి కాస్తా నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు.అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. అయ్యో పాపం అని బాధపడ్డారు. "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు. పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకోకడు. "నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు.

బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు. వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా! వచ్చినావా అంది ఆప్యాయంగా.వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.

వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు.
భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు"
వేటగాడు : "ఆవును కూడా గాడిదకు మారకం వేశా"
భార్య : "కట్టెలు అడివినుంచి మోసుకు వస్తుందిలే" అంది తృప్తిగా.
వేటగాడు : "గాడిదను అమ్మేసి చెప్పులు తీసుకొన్నా"
భార్య : "అడవుల్లో రాళ్లు, రప్పలు తగలకుండా ఉంటుందిలే మావా"
వేటగాడు : "అవి కూడా ఉంచుకో లేక టోపీకి మారకం వేసినా"
భార్య : "సరేలే మావా ఆ టోపితో అందంగా ఉంటావు"
వేటగాడు : "కానీ వస్తావుంటే నేను వంతెన మీద పడితే టోపి జారి నీళ్లలో పడ్డది"
భార్య : "పోతే పోయిందిలే మావా! నీవు పడిపోకుండా వున్నావు, అంతా అడవి తల్లి దయ" అని తృప్తిగా ముద్దు పెట్టుకుంది.
గుర్రాన్ని నష్టపోయి వచ్చినందుకు భర్తను విమర్శించకుండా, ఎత్తిపొడుపు మాటలు అనకుండా, భర్త క్షేమంగా ఇంటికి వచ్చినందుకు అడవి తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంది.
ఎగతాళి చేద్దామనుకున్న బాటసారులు ఆ వేటగాడి భార్య మంచి మనసుకు సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయారు.
* * * * * * * * * * * * * * * * *
మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార సంబంధాలుగా పరిణమిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సంభాషణ వినగలమా!
కరుగుతున్న క్షణానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయసుకి చివరకు మరపురాని జ్ఞాపకాలుగా మిగిలేవి జీవితంలో జరిగే కొన్ని మంచి సందర్భాలే.
అందుకే, ఏ ఒక్కరిని తొందరపడి ఏం అనకండి. కన్ను చెదిరితే, గురి మాత్రమే తప్పుతుంది. మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పు తుంది. ఎగతాళి చేసేవారికి కాలమే సమాధానం చెబుతుంది.

Thursday, July 16, 2020

A successful story about a daily labour man.

మన దగ్గిర ఇలా సిగ్గు పడే వాళ్ళు వున్నారా ?

🏵️ఆ కలెక్టరమ్మ ఎందుకు సిగ్గుపడింది..? ఏమిటీ ఆ వింత కథ..?


🏵️ఆమె…. డాక్టర్ బృంద ఐఏఎస్… కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్ ఆమె…! కాస్తోకూస్తో జనం కోణంలో… ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్…! అదసలే ఒడిశా… బీమారు రాష్ట్రాల్లో ఒకటి… అంతులేని పేదరికం, జాడతెలియని అభివృద్ధి… అనేకానేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అసలే ఉండదు, వైద్యం అందదు… ఆమె ఓరోజు పత్రికలు చదువుతుంటే ఆమెను ఓ వార్త ఆకర్షించింది…

🏵️ అది సంపూర్ణంగా చదివింది… వివరాలు తెప్పించుకున్నది… ఓ కలెక్టర్‌గా సిగ్గుపడింది… ఈ వ్యవస్థకు ఏమీ చేయలేకపోతున్నాను సుమా అని తలవంచుకున్నది… డ్రైవర్‌ను పిలిచింది, గుమ్సాహి అనే ఊరి దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్పింది… డ్రైవర్ పరేషాన్… ఆమె బయల్దేరింది…

🏵️ ఆ ఊరు చేరుకున్నది… ఇక్కడ జలంధర్ నాయక్ అంటే ఎవరు అని అడిగింది…. ఏమిటీ కథ నేపథ్యం..?ఆయన ఓ మట్టిమనిషి… వయసు 45… పుల్బనీ తాలూకాలోని గుమ్సాహి తన సొంతూరు… ఒంటిచేత్తో కొండను తొలిచి తమ ఊరికి రోడ్డు వేసిన బీహారీ దశరథ్ మాంఝీ కథ తెలుసు కదా… సేమ్, ఆయన ఒడిశా మాంఝీ… ఎందుకో తెలుసా..? తనూ అంతే… ఆ ఊరికి రోడ్డు లేదు, నిజం చెప్పాలా..? కరెంటు కూడా లేదు, మంచినీటి సరఫరా ఆశించేదే లేదు…

 🏵️ఒక్కొక్కరే ఊరు విడిచి వెళ్లిపోయారు… ఆ స్థితిలో ఆ ఊరికి రోడ్డు తనే సొంతంగా వేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ జలంధర్… ఎందుకు..? తన ఊరి నుంచి పుల్బనీలోని పాఠశాలకు పిల్లలు వెళ్లాలన్నా అవస్థలే… ఎవరిని ఎన్నేళ్లు వేడుకున్నా ఫలితం లేదాయె… లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులకు అస్సలు పట్టదాయె… అసలు ఈ దేశానికి పట్టిన దరిద్రమే ఈ నాయకులు, ఈ అధికారులు అని అర్థమైంది… దాంతో ఓ ఆలోచనకు వచ్చాడు… కనీసం తన ఊరికి రోడ్డు వేసుకోలేనా…?భార్య సద్దిమూట కట్టి ఇచ్చింది… ఓ పలుగూ, ఓ పార పట్టుకుని బయల్దేరాడు… రోజూ పొద్దున మొదలు పెట్టి సాయంత్రం దాకా తనే రోడ్డు వేయడం మొదలు పెట్టాడు…

🏵️రాళ్లూరప్పల్ని తొలగిస్తూ, రోడ్డు వేసుకుంటే పోతున్నాడు… మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు తన టార్గెట్… ఒక్కడూ సహకరించినవాడు లేడు… అయితేనేం..? ఆ గడ్డపార ఆగలేదు, ఆ పార అలిసిపోలేదు… రెండేళ్లు… నమ్మండి… రెండేళ్లపాటు కష్టపడ్డాడు… 

🏵️నా జీవిత లక్ష్యం అదే అని తీర్మానించుకుని అదే పనిలో మునిగిపోయాడు… 8 కిలోమీటర్ల రోడ్డు తనొక్కడే నిర్మించాడు… ఓరోజు ‘గుండెలో తడి’ ఇంకా మిగిలిన ఓ స్థానిక పత్రిక జర్నలిస్టు ఆ కథను రాశాడు… అదీ ఆ కలెక్టర్ దగ్గరకు చేరింది… ఆమె చదివింది… ఆమె కళ్లు చెమర్చాయి…

 🏵️ఈ వ్యవస్థలో భాగమైన తను కూడా సిగ్గుపడాలి కదానే భావన ఆమెను తలవంచుకునేలా చేసింది… అందుకే ఆ ఊరికి బయల్దేరింది…అతన్ని కలిసింది… మాట్లాడింది… ‘ఏం లేదు మేడమ్… మూడేళ్లు ఆగండి, నేనా రోడ్డును పూర్తి చేస్తాను’ అన్నాడు జలంధర్… ఆమె మరింత సిగ్గుపడింది… ఓసారి రోడ్డు చూద్దామంటూ వెళ్లింది…

🏵️ఒక మనిషి శ్రమను, లక్ష్యాన్ని, నిబద్ధతను, కష్టాన్ని, సంకల్పాన్ని చూసింది… ఆమెలో కలెక్టర్ అనే పాత్ర నిద్రలేచింది… అయ్యా, మీ త్యాగం నిరుపమానం అని ఆయన చేతులు పట్టుకున్నది… మిగతా ఆ ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఇక నాకు వదిలెయ్ అని చెప్పింది… తనకు అందుబాటులో ఉన్న ఏవో నిధులను అడ్జస్ట్ చేసింది… ఆ రోడ్డు పూర్తయ్యేదాకా దాని నిర్మాణ పర్యవేక్షణకూ తననే నియమించింది… అంతేకాదు, ఇప్పుడా ఊరికి కరెంటు పోల్స్, లైన్స్ పడుతున్నాయి… మంచినీటి సరఫరా ప్రణాళికా రూపుదిద్దుకున్నది…

 🏵️మరో విషయం… ఈ రెండేళ్లపాటు తను చేసిన పనికి ఉపాధిహామీ కింద డబ్బులు ఇవ్వటానికి కూడా ఆమె అంగీకరించింది… వావ్… ఇవీ కదా సక్సెస్ స్టోరీలు… ఇవీ కదా పది మందికీ స్పూర్తినిచ్చే అసలు విజయగాథలు…!!

Monday, June 29, 2020

lord puri jagannath story

పూరీ జగన్నాధ స్వామి 🙏

పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న 
మిస్టరీలేంటో ఓసారి తెలుసుకొండి

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 
65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం. 
అక్కడ ఉండే స్తంభాలు, గోడలు.. 
అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే.

జెండా:

ఈ ఆలయ గోపురం పైన ఉండే జెండాకు కూడా 
ప్రత్యేకత ఉంది. 
మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే.. 
గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది. 
కానీ.. ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా.. వ్యతిరేక దిశలో ఊగుతుంది.

చక్రం:

పూరీ జగన్నాథ్ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందని తెలిసిందే. 
ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది. 
మీరు పూరీలో ఎక్కడ ఉండి అయినా సరే.. 
ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే.. 
అది మీ వైపే తిరిగినట్టు కనిపిస్తుంది. 
అది ఆ చక్రం ప్రత్యేకత.

అలలు:

సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపునకు ఉంటుంది. 
పగటి పూట అలా వీస్తుంది. 
సాయంత్రం పూట భూమి వైపు నుంచి 
సముద్రం వైపునకు వీస్తుంది. 
కానీ.. పూరీలో మాత్రం అంతా రివర్స్. 
దానికి విభిన్నంగా గాలి వీస్తుంది.

పక్షులు:

జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. 
ఆలయం పైకి పక్షులు వెళ్లవు. 
పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు.. 
అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. ఎంతో మంది దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోతున్నారు.

గోపురం నీడ:

జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ 
ఎవ్వరికీ కనిపించదు. 
సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. 
పగలు అయినా.. సాయంత్రం అయినా 
ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ 
మాత్రం కనిపించదు. 
దీని నిర్మాణం అలా ఉంటుందా? 
లేక దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వారం 
గోపురం నీడ కనిపించదా? 
అనేది మాత్రం అంతు చిక్కడం లేదు.

ప్రసాదం వృథా చేయరు
పూరీ జగన్నాథ్ ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని కొంచెం కూడా వృథా చేయరు. 
మొత్తం తినేస్తారు.

అలల శబ్దం:

సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడి లోపలికి పెట్టగానే.. 
సముద్రంలో నుంచి వచ్చే శబ్దం వినిపించదు. 
కానీ.. అడుగు బయటపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది

రథ యాత్ర:

పూరీ జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైంది ఇదే. పూరీ రథ యాత్ర. 
ఈ రథ యాత్రలో రెండు రథాలు ఉంటాయి. 
శ్రీమందిరం, గుండిజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్లాలి. 
అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు. 
మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిజా ఆలయానికి తీసుకెళతారు.

రథాలు:

పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. 
ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 
35 అడుగుల వెడల్పు ఉంటుంది. 
ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి.

బంగారు చీపురు:

రథ యాత్రకు ముందు బంగారు చీపురుతో 
రథాల ముందు ఊడ్చుతారు. 
ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు.

విగ్రహాలు:

ఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేశారు.

గుండీజా ఆలయం:

ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో 
విశిష్టత ఏంటంటే.. 
గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే.. 
రథం తనంతట తానే ఆగిపోతుంది. 
దాన్ని ఎవ్వరూ ఆపరు. 
ఇది కూడా ఇప్పటికీ ఓ మిస్టరీలాగానే ఉండిపోయింది.

దేవుడికి ప్రసాదం:

పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది. 
ఆలయ సంప్రదాయం ప్రకారం.. 
వాటిని మట్టి కుండల్లో వండుతారు. 
దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన ఉండదు. 
రుచి కూడా ఉండదు కానీ.. 
దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలు ఘుమఘుమలాడుతాయి. 
ఎంతో మధురంగా ఉంటాయి ప్రసాదాలు.

Tuesday, June 16, 2020

keelu gurramu story 1

చందమామ కథలు 


కీలు గుర్రము 
అనగా  అనగా  ఒక్క  నవాబు  ఉండేవాడు. ఆ  నవాబుకు  ఒక్కడే  కొడుకు  మరియు  ఒక్కతే  కూతురు.  కొడుకు  చాలా  సాహసి.  మిన్ను  విరిగి  మీద పడ్డా  జంకేవాడుకాదు. అతని  పేరు  ఫిరోజిషా.  కూతురు  పేరు  జహానారా. 

ఆ  నవాబు   ప్రతి  సంవత్సరం   వైభవంగా   పీర్ల  పండుగ  చేసేవాడు.  ఆ  ఉత్సవాలు  చూడడానికి  దేశ  దేశాలు  నుండు  రాజాకుమారులు, కవులు,  గాయకులు,  శిల్పులు వచ్చి   వాళ్ళ   విద్యలు చూసి  నవాబు  దగ్గర  బహుమతులు  పొందేవాళ్లు.  

ఆ  సంవత్సరం  ఉత్సవాలుకు   ఒక్క  ముసలి   శిల్పి  వచ్చాడు.  కానీ  ఇతర  శిల్పులు  ఆడే  బొమ్మలు, పాడెబొమ్మలు  ఇంకా  రకరకాల  ప్రతిమలు  తెస్తే,  కానీ  ముసలితాతా   ఒక్క  కొయ్య  బొమ్మ  గుర్రాన్ని  పట్టుకోచ్చాడు.  తాతను చూడగానే  అక్కడ ఉన్న  శిల్పులు  నవ్వసాగారు. 

"ఈ  గుర్రాన్ని   నువ్వే  చేసావా  తాతయ్య"  అని  అడిగాడు  ఒక్క  శిల్ప .  

"బలే  గుర్రం  తాతయ్య  ఇంతకీ ఇస్తావు గుర్రాన్ని"  అని  వెక్కిరించాడు  మరో  శిల్పి. 

"ఏమి  గుర్రం  మనుకున్నావురా   ఆది   దేవతగుర్రహ"  అని  అన్నాడు  మరి శిల్పి.  

తాతకి  కోపం వచ్చి  "మీరు  కొనలేరు,  మీ అబ్బలుకొనలేరు,  ఎందుకు  మీకు  వచ్చిన బాధ?  పోండి, పొంది"  అని  కసిరాడు. 

నవాబు  శిల్పులు  తెచ్చిన   బొమ్మలు   చూసి  మంచివాటిని   పుచ్చుకొని   అయా   శిల్పులు   తగిన   బహుమతులు  ఇచ్చాడు.  చివరికి  ముసలి  తాతా  కొయ్యగుర్రం   మిగిలింది.  "ఏంటి  దేని  విశేషం" అని  అడిగాడు  నవాబు. 

"మీరు  చిత్తగిస్తే   మనవి  చేస్తాను.  ఇది   వట్టి   చూపులగుర్రం   కాదు  కీలుగుర్రం.  కళ్ళు  మూసుకొని  తెరిచే  లోపుల   చుక్కలన్నీ  చూసివస్తుంది  అకాశం   ఆంతు  కనుకూస్తుంది.  అని  అన్నాడు  తాతా. "

"చుప్! చుప్!  అంతా  అబద్ధం   అల్లాంటిది  ఈ  భూలోకం  లోనే లేదు."  అని  అన్నాడు  నవాబు. 

"మీరు  అనుమతి  ఇస్తే  ఇప్పుడే  నేను  చేసి  చూపిస్తాను,"  అని అన్నాడు  శిల్పి .

"ఎక్కడ  పదోకాసుల  దూరంలో   చందంపర్వతం  ఉంది.  దాని  మీద   మసీదు.  మసీదుకు   పక్కన  ఖర్జురపు  చెట్టు  ఉంది .   పోయి   ఆ  చెట్టు  అకు  పట్టుకురా  చూస్తాను,"  అని అన్నాడు  నవాబు. 
ముసలి  శిల్పి  సరి అని  నవాబు  అనుమతి   తీసుకొని  గుర్రంమేక్కి  ఎదో  బుడ్డపు  లాగావున్న  మీద  నొక్కాడు.  గుర్రం ఇంకా అఘమేఘాలు  మీద  లేచింది.  అది అప్పుడు  వెళ్లి  ఎప్పుడు  వచ్చిందో  ఎవరికీ  తెలియదు.    నవాబు  తెప్పరిల్లి  చూచేసరికి  ఖర్జురపు  ఆకూ  పుచ్చుకొని  శిల్పి  ఎదురుగ  నుంచున్నాడు. 

నవాబు  ఎల్లాగయినా  ఆ  గుర్రం  కావాలి అని అనికున్నాడు.  "నీకు ఏమి కావాలి  అయినా కోరి  పుచ్చుకో.  నాకు  ఆ కీలు  గుర్రం  మాత్రం  కావాలి"  అని  అన్నాడు  నవాబు. 

"అయితే  నీ కుమార్తెను  నాకు  ఇచ్చి   పెళ్లి  చేయండి " అని  శిల్పి  అన్నాడు.  అక్కడ  ఉన్న వాళ్ళు  అంత  తెల్లబోయారు.  శిల్పి  మూడుకాళ్ళ   ముసలి  అందులో  పగలుచూస్తే   రాత్రి  కల్లోకి  వస్తాడు.  అల్లాంటివాడికి  చూస్తూ  చూస్తూ  రాజు  కూతురు  ఇంకా  పదహారేళ్లు  కూడా లేవు   ఎల్లా  ఇవ్వడం ?  అని  నవాబు  ఆలోచించాడు.  

నవాబు  కుమారుడు  పిరోజోషా  ఎన్నాడు ....  "నీవు  గరిడి  చేసావో  ఏమో  తెలియదు లేక,  ఆ  గుర్రంనికి   అంత  శక్తి  ఉందొ  తెలియదు.  ఇతరులు  ఎక్కుతే  పోతుందో  లేదో తెలియదు కదా" అని నేను  పరీక్షస్తా   అని  అన్నడు . 

ఫిరోజిష   ఎక్కడకో   వెళ్ళాలి   అని  కీలు  గుర్రం  ఎక్కి  మీటు నొక్కాడు.  ఆది  రివ్వున్న   లేచి, చూస్తుండగానే  ఆకాశం  లోకి  దూసుకుపోయింది.  నవాబు ,  అతని  బలగం  తెల్ల  బోయి  చుస్తునారు.  ఇంత  సాహసం  జరుగుతుంది అని ఎవ్వరు  అనుకోలేదు.   ఫిరోజిష  మల్లి  వస్తాడు  అని  ఎద్దురు  చుస్తున్నారు .  మధ్యాహ్నం  అయింది  ఆచూకీ  లేదు,  సాయంత్రం  అయింది  ఇంకా  రాలేదు,   ప్రొద్దుగూకింది  ఆనవాలు  లేవు అసలు.  నవాబుకి  పట్టరాని  కోపం  వచ్చింది.  శిల్పి  ఈ గుర్రం  తేవకుంటే  నా  కొడుకు  ఇలా  అయేవాడు  కాదుగా.   "వీణ్ణి  తీసుకెళ్లి   జైలులో  పెట్టండి  తరువాత   చూడం" అని  చెప్పాడు. నవాబు  శిల్పిని  తీసుకెళ్లి    జైలులో    తోసారు.

ఇంకా  ఫిరోజిషా  ఆ  కీలుగుర్రం  మీద  వాయువేగంతో  పైకిలేచాడు.  ఆ  వేగానికి  అతనికి  భయం  వేసింది.  తాను  ఎంత  ఎంతున్నా  ఉన్నడో  చూసాడు  క్రింద  ఎవ్వరు  కనిపివలేదు.  చెట్లు  కూడా  కానివిపవడం  లేదు.  తన  కోట  కూడా  కనిపించలేదు. కానీ  చంద్రగిరి  మాత్రం  చిన్న  పుట్ట  లాగా  కనపడింది. దానితో  అతని  కళ్ళు  తెరిగాయి.  గుర్రం  జూలు  మాత్రం  గట్టిగ  పట్టుకున్నాడు.   అది  ఆగకుండా  పైకిపోతుంది.  

ఫిరోజిషాకు   పెద్దలు  తలుపుకోచ్చారు  అల్లారుముద్దుగా  పేచిన  తండ్రి  గుర్తుకు  వచ్చారు.  రోజు  తనతో  ఆడుకుండే  చెల్లి  గుర్తుకువచ్చింది  అల్లాగే  స్నేహితులు  గుర్తుకువచ్చారు. అతనికి  భయం  ఎక్కువ  అయింది  కళ్ళు  ఇంకా  గట్టిగ  మూసుకున్నాడు.  కానీ  గుర్రం  వాయువేగంతో  దూసుకుపోతుంది.  

ఇల్లా  కొంతసేపు  పోగా   పోగా  ఫిరోజిషాకు  జూడుపు  తాగింది.  గుర్రాన్ని  ఎల్లా  కిందకి  దించండం  ఆలోచించాడు.   ఎక్కడో  దానికి  మరొక మీటు  ఉండితీరాలి  అనుకున్నాడు. జూల్లాలో  వెతికాడు  కానీ  కనపడలేదు.  జీను ప్రక్కన్న చీలలు  తిప్పి  చూసాడు  కానీ  లాభం   లేకపోయింది.  చివరికి  విసుగెత్తి  దాన్ని  రెండు  చెవులు  పట్టుకున్నాడు .  అప్పుడు  గుర్రం  వేగం  తగ్గి  నెమ్మదిగా  కిందకి  దిగసాగింది.  అప్పుడు  తన  ప్రాణాలు  కుదుటపడ్డాయి.  అల్లా  కిందకి  దిగి  దిగి  చివరికి  ఆరు అంతస్తులు  మేడా మీద  వాలింది. 
అప్పిటికే   బాగా  ప్రోడుకుపోయింది.

Monday, June 15, 2020

potti pichuka katha

అనగా అనగా ఓ ఊర్లో  ఒక పొట్టి  పిచిక  వుండేది. అదేంచేసిందీ, ఉరేల్లా తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి సేనగ్గింజ,  పెరడల్లా తిరిగి పెసరగింజ, ఇల్లంటివి  ఎన్నో గింజలు  పోగుచేసుకొని  కొట్టి  కొట్టి  కొండంత  రొట్టిచేసుకుంది. చేసుకొని, చింత  చెట్టుమీద  కూర్చొని,  ఆ  పిచిక  ఆ  రొట్టెను  ఎగరేసుకుంటూ,  తింటూ  ఉంటే,  చిమ  తలకాయంత ముక్క చెట్టుతొర్రలో పడి  పోయింది. 

అప్పుడు  పిచిక  ఎం  చేసింది  వడ్రంగి  దగ్గరికి  వెళ్లి,  "వడ్రంగి, వడ్రంగి,  అతి  కష్టపడి  కొండంత  రోటే చేసుకొని  తింటుంటే చీమ  తలకాయంత  ముక్క  చెట్టు  తొర్రలో  పడిపోయిండోయే!  చెట్టుకొట్టి  అది  తీసి  పేటలోయ్," అని   అంది.
వడ్రంగి  'చీమ  తలకాయంత ముక్కకే  చెట్టు  కొట్టాల? ' అని పక పక నవ్వాడు.
అప్పుడు   పిచికా  కెంతో కోపంవచ్చి తిన్నగా రాజు దగ్గరికివెళ్లి, "రాజుగారూ, రాజుగారూ! అతి కష్టపడి కొండంత రొట్టి చేసుకొని తింటూంటే చీమ తలకాయంత ముక్కు చెట్టుతొర్రలో పడిపోయింది. తీసి పెట్టమని వడ్రంగి నడిగితే తీయనన్నాడు. కావున  వడ్రంగిని  దండించు  రాజా" అని  అంది. 

రాజుకూడా నవ్వి , "ఇంత  చిన్న పనికి వడ్రంగిని దండించాలా?  దండించను   పో" అని  అన్నాడు రాజు.
"అమ్మా విడిపని ఇలా వుందా!"  అని  ఆ  పిచిక  వెంటనే  లేళ్ల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి," చెట్టు కొట్టి మంటే వడ్రంగి కొటానన్నాడు. వడ్రంగిని దంచించమంటే రాజు దంచించలేదు. రాజుకు ఉద్యానవనమంటే ఎంతో ఇష్టం. అది పాడుచేయండి లేళ్ళూ!" అంది. 
"ఈ చిమటలకాయంత రొట్టిముక్కకి చక్కటి రాజు పూలతోట పాడుచేస్తామా? చాలు, చాలు పో," అన్నాయ్ లేళ్లు. 
"అమ్మ! వీటమ్మ కడుపు కాలా! ఈ