Monday, June 29, 2020

lord puri jagannath story

పూరీ జగన్నాధ స్వామి 🙏

పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న 
మిస్టరీలేంటో ఓసారి తెలుసుకొండి

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 
65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం. 
అక్కడ ఉండే స్తంభాలు, గోడలు.. 
అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే.

జెండా:

ఈ ఆలయ గోపురం పైన ఉండే జెండాకు కూడా 
ప్రత్యేకత ఉంది. 
మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే.. 
గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది. 
కానీ.. ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా.. వ్యతిరేక దిశలో ఊగుతుంది.

చక్రం:

పూరీ జగన్నాథ్ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందని తెలిసిందే. 
ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది. 
మీరు పూరీలో ఎక్కడ ఉండి అయినా సరే.. 
ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే.. 
అది మీ వైపే తిరిగినట్టు కనిపిస్తుంది. 
అది ఆ చక్రం ప్రత్యేకత.

అలలు:

సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపునకు ఉంటుంది. 
పగటి పూట అలా వీస్తుంది. 
సాయంత్రం పూట భూమి వైపు నుంచి 
సముద్రం వైపునకు వీస్తుంది. 
కానీ.. పూరీలో మాత్రం అంతా రివర్స్. 
దానికి విభిన్నంగా గాలి వీస్తుంది.

పక్షులు:

జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. 
ఆలయం పైకి పక్షులు వెళ్లవు. 
పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు.. 
అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. ఎంతో మంది దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోతున్నారు.

గోపురం నీడ:

జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ 
ఎవ్వరికీ కనిపించదు. 
సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. 
పగలు అయినా.. సాయంత్రం అయినా 
ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ 
మాత్రం కనిపించదు. 
దీని నిర్మాణం అలా ఉంటుందా? 
లేక దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వారం 
గోపురం నీడ కనిపించదా? 
అనేది మాత్రం అంతు చిక్కడం లేదు.

ప్రసాదం వృథా చేయరు
పూరీ జగన్నాథ్ ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని కొంచెం కూడా వృథా చేయరు. 
మొత్తం తినేస్తారు.

అలల శబ్దం:

సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడి లోపలికి పెట్టగానే.. 
సముద్రంలో నుంచి వచ్చే శబ్దం వినిపించదు. 
కానీ.. అడుగు బయటపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది

రథ యాత్ర:

పూరీ జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైంది ఇదే. పూరీ రథ యాత్ర. 
ఈ రథ యాత్రలో రెండు రథాలు ఉంటాయి. 
శ్రీమందిరం, గుండిజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్లాలి. 
అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు. 
మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిజా ఆలయానికి తీసుకెళతారు.

రథాలు:

పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. 
ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 
35 అడుగుల వెడల్పు ఉంటుంది. 
ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి.

బంగారు చీపురు:

రథ యాత్రకు ముందు బంగారు చీపురుతో 
రథాల ముందు ఊడ్చుతారు. 
ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు.

విగ్రహాలు:

ఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేశారు.

గుండీజా ఆలయం:

ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో 
విశిష్టత ఏంటంటే.. 
గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే.. 
రథం తనంతట తానే ఆగిపోతుంది. 
దాన్ని ఎవ్వరూ ఆపరు. 
ఇది కూడా ఇప్పటికీ ఓ మిస్టరీలాగానే ఉండిపోయింది.

దేవుడికి ప్రసాదం:

పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది. 
ఆలయ సంప్రదాయం ప్రకారం.. 
వాటిని మట్టి కుండల్లో వండుతారు. 
దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన ఉండదు. 
రుచి కూడా ఉండదు కానీ.. 
దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలు ఘుమఘుమలాడుతాయి. 
ఎంతో మధురంగా ఉంటాయి ప్రసాదాలు.

Tuesday, June 16, 2020

keelu gurramu story 1

చందమామ కథలు 


కీలు గుర్రము 
అనగా  అనగా  ఒక్క  నవాబు  ఉండేవాడు. ఆ  నవాబుకు  ఒక్కడే  కొడుకు  మరియు  ఒక్కతే  కూతురు.  కొడుకు  చాలా  సాహసి.  మిన్ను  విరిగి  మీద పడ్డా  జంకేవాడుకాదు. అతని  పేరు  ఫిరోజిషా.  కూతురు  పేరు  జహానారా. 

ఆ  నవాబు   ప్రతి  సంవత్సరం   వైభవంగా   పీర్ల  పండుగ  చేసేవాడు.  ఆ  ఉత్సవాలు  చూడడానికి  దేశ  దేశాలు  నుండు  రాజాకుమారులు, కవులు,  గాయకులు,  శిల్పులు వచ్చి   వాళ్ళ   విద్యలు చూసి  నవాబు  దగ్గర  బహుమతులు  పొందేవాళ్లు.  

ఆ  సంవత్సరం  ఉత్సవాలుకు   ఒక్క  ముసలి   శిల్పి  వచ్చాడు.  కానీ  ఇతర  శిల్పులు  ఆడే  బొమ్మలు, పాడెబొమ్మలు  ఇంకా  రకరకాల  ప్రతిమలు  తెస్తే,  కానీ  ముసలితాతా   ఒక్క  కొయ్య  బొమ్మ  గుర్రాన్ని  పట్టుకోచ్చాడు.  తాతను చూడగానే  అక్కడ ఉన్న  శిల్పులు  నవ్వసాగారు. 

"ఈ  గుర్రాన్ని   నువ్వే  చేసావా  తాతయ్య"  అని  అడిగాడు  ఒక్క  శిల్ప .  

"బలే  గుర్రం  తాతయ్య  ఇంతకీ ఇస్తావు గుర్రాన్ని"  అని  వెక్కిరించాడు  మరో  శిల్పి. 

"ఏమి  గుర్రం  మనుకున్నావురా   ఆది   దేవతగుర్రహ"  అని  అన్నాడు  మరి శిల్పి.  

తాతకి  కోపం వచ్చి  "మీరు  కొనలేరు,  మీ అబ్బలుకొనలేరు,  ఎందుకు  మీకు  వచ్చిన బాధ?  పోండి, పొంది"  అని  కసిరాడు. 

నవాబు  శిల్పులు  తెచ్చిన   బొమ్మలు   చూసి  మంచివాటిని   పుచ్చుకొని   అయా   శిల్పులు   తగిన   బహుమతులు  ఇచ్చాడు.  చివరికి  ముసలి  తాతా  కొయ్యగుర్రం   మిగిలింది.  "ఏంటి  దేని  విశేషం" అని  అడిగాడు  నవాబు. 

"మీరు  చిత్తగిస్తే   మనవి  చేస్తాను.  ఇది   వట్టి   చూపులగుర్రం   కాదు  కీలుగుర్రం.  కళ్ళు  మూసుకొని  తెరిచే  లోపుల   చుక్కలన్నీ  చూసివస్తుంది  అకాశం   ఆంతు  కనుకూస్తుంది.  అని  అన్నాడు  తాతా. "

"చుప్! చుప్!  అంతా  అబద్ధం   అల్లాంటిది  ఈ  భూలోకం  లోనే లేదు."  అని  అన్నాడు  నవాబు. 

"మీరు  అనుమతి  ఇస్తే  ఇప్పుడే  నేను  చేసి  చూపిస్తాను,"  అని అన్నాడు  శిల్పి .

"ఎక్కడ  పదోకాసుల  దూరంలో   చందంపర్వతం  ఉంది.  దాని  మీద   మసీదు.  మసీదుకు   పక్కన  ఖర్జురపు  చెట్టు  ఉంది .   పోయి   ఆ  చెట్టు  అకు  పట్టుకురా  చూస్తాను,"  అని అన్నాడు  నవాబు. 
ముసలి  శిల్పి  సరి అని  నవాబు  అనుమతి   తీసుకొని  గుర్రంమేక్కి  ఎదో  బుడ్డపు  లాగావున్న  మీద  నొక్కాడు.  గుర్రం ఇంకా అఘమేఘాలు  మీద  లేచింది.  అది అప్పుడు  వెళ్లి  ఎప్పుడు  వచ్చిందో  ఎవరికీ  తెలియదు.    నవాబు  తెప్పరిల్లి  చూచేసరికి  ఖర్జురపు  ఆకూ  పుచ్చుకొని  శిల్పి  ఎదురుగ  నుంచున్నాడు. 

నవాబు  ఎల్లాగయినా  ఆ  గుర్రం  కావాలి అని అనికున్నాడు.  "నీకు ఏమి కావాలి  అయినా కోరి  పుచ్చుకో.  నాకు  ఆ కీలు  గుర్రం  మాత్రం  కావాలి"  అని  అన్నాడు  నవాబు. 

"అయితే  నీ కుమార్తెను  నాకు  ఇచ్చి   పెళ్లి  చేయండి " అని  శిల్పి  అన్నాడు.  అక్కడ  ఉన్న వాళ్ళు  అంత  తెల్లబోయారు.  శిల్పి  మూడుకాళ్ళ   ముసలి  అందులో  పగలుచూస్తే   రాత్రి  కల్లోకి  వస్తాడు.  అల్లాంటివాడికి  చూస్తూ  చూస్తూ  రాజు  కూతురు  ఇంకా  పదహారేళ్లు  కూడా లేవు   ఎల్లా  ఇవ్వడం ?  అని  నవాబు  ఆలోచించాడు.  

నవాబు  కుమారుడు  పిరోజోషా  ఎన్నాడు ....  "నీవు  గరిడి  చేసావో  ఏమో  తెలియదు లేక,  ఆ  గుర్రంనికి   అంత  శక్తి  ఉందొ  తెలియదు.  ఇతరులు  ఎక్కుతే  పోతుందో  లేదో తెలియదు కదా" అని నేను  పరీక్షస్తా   అని  అన్నడు . 

ఫిరోజిష   ఎక్కడకో   వెళ్ళాలి   అని  కీలు  గుర్రం  ఎక్కి  మీటు నొక్కాడు.  ఆది  రివ్వున్న   లేచి, చూస్తుండగానే  ఆకాశం  లోకి  దూసుకుపోయింది.  నవాబు ,  అతని  బలగం  తెల్ల  బోయి  చుస్తునారు.  ఇంత  సాహసం  జరుగుతుంది అని ఎవ్వరు  అనుకోలేదు.   ఫిరోజిష  మల్లి  వస్తాడు  అని  ఎద్దురు  చుస్తున్నారు .  మధ్యాహ్నం  అయింది  ఆచూకీ  లేదు,  సాయంత్రం  అయింది  ఇంకా  రాలేదు,   ప్రొద్దుగూకింది  ఆనవాలు  లేవు అసలు.  నవాబుకి  పట్టరాని  కోపం  వచ్చింది.  శిల్పి  ఈ గుర్రం  తేవకుంటే  నా  కొడుకు  ఇలా  అయేవాడు  కాదుగా.   "వీణ్ణి  తీసుకెళ్లి   జైలులో  పెట్టండి  తరువాత   చూడం" అని  చెప్పాడు. నవాబు  శిల్పిని  తీసుకెళ్లి    జైలులో    తోసారు.

ఇంకా  ఫిరోజిషా  ఆ  కీలుగుర్రం  మీద  వాయువేగంతో  పైకిలేచాడు.  ఆ  వేగానికి  అతనికి  భయం  వేసింది.  తాను  ఎంత  ఎంతున్నా  ఉన్నడో  చూసాడు  క్రింద  ఎవ్వరు  కనిపివలేదు.  చెట్లు  కూడా  కానివిపవడం  లేదు.  తన  కోట  కూడా  కనిపించలేదు. కానీ  చంద్రగిరి  మాత్రం  చిన్న  పుట్ట  లాగా  కనపడింది. దానితో  అతని  కళ్ళు  తెరిగాయి.  గుర్రం  జూలు  మాత్రం  గట్టిగ  పట్టుకున్నాడు.   అది  ఆగకుండా  పైకిపోతుంది.  

ఫిరోజిషాకు   పెద్దలు  తలుపుకోచ్చారు  అల్లారుముద్దుగా  పేచిన  తండ్రి  గుర్తుకు  వచ్చారు.  రోజు  తనతో  ఆడుకుండే  చెల్లి  గుర్తుకువచ్చింది  అల్లాగే  స్నేహితులు  గుర్తుకువచ్చారు. అతనికి  భయం  ఎక్కువ  అయింది  కళ్ళు  ఇంకా  గట్టిగ  మూసుకున్నాడు.  కానీ  గుర్రం  వాయువేగంతో  దూసుకుపోతుంది.  

ఇల్లా  కొంతసేపు  పోగా   పోగా  ఫిరోజిషాకు  జూడుపు  తాగింది.  గుర్రాన్ని  ఎల్లా  కిందకి  దించండం  ఆలోచించాడు.   ఎక్కడో  దానికి  మరొక మీటు  ఉండితీరాలి  అనుకున్నాడు. జూల్లాలో  వెతికాడు  కానీ  కనపడలేదు.  జీను ప్రక్కన్న చీలలు  తిప్పి  చూసాడు  కానీ  లాభం   లేకపోయింది.  చివరికి  విసుగెత్తి  దాన్ని  రెండు  చెవులు  పట్టుకున్నాడు .  అప్పుడు  గుర్రం  వేగం  తగ్గి  నెమ్మదిగా  కిందకి  దిగసాగింది.  అప్పుడు  తన  ప్రాణాలు  కుదుటపడ్డాయి.  అల్లా  కిందకి  దిగి  దిగి  చివరికి  ఆరు అంతస్తులు  మేడా మీద  వాలింది. 
అప్పిటికే   బాగా  ప్రోడుకుపోయింది.

Monday, June 15, 2020

potti pichuka katha

అనగా అనగా ఓ ఊర్లో  ఒక పొట్టి  పిచిక  వుండేది. అదేంచేసిందీ, ఉరేల్లా తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి సేనగ్గింజ,  పెరడల్లా తిరిగి పెసరగింజ, ఇల్లంటివి  ఎన్నో గింజలు  పోగుచేసుకొని  కొట్టి  కొట్టి  కొండంత  రొట్టిచేసుకుంది. చేసుకొని, చింత  చెట్టుమీద  కూర్చొని,  ఆ  పిచిక  ఆ  రొట్టెను  ఎగరేసుకుంటూ,  తింటూ  ఉంటే,  చిమ  తలకాయంత ముక్క చెట్టుతొర్రలో పడి  పోయింది. 

అప్పుడు  పిచిక  ఎం  చేసింది  వడ్రంగి  దగ్గరికి  వెళ్లి,  "వడ్రంగి, వడ్రంగి,  అతి  కష్టపడి  కొండంత  రోటే చేసుకొని  తింటుంటే చీమ  తలకాయంత  ముక్క  చెట్టు  తొర్రలో  పడిపోయిండోయే!  చెట్టుకొట్టి  అది  తీసి  పేటలోయ్," అని   అంది.
వడ్రంగి  'చీమ  తలకాయంత ముక్కకే  చెట్టు  కొట్టాల? ' అని పక పక నవ్వాడు.
అప్పుడు   పిచికా  కెంతో కోపంవచ్చి తిన్నగా రాజు దగ్గరికివెళ్లి, "రాజుగారూ, రాజుగారూ! అతి కష్టపడి కొండంత రొట్టి చేసుకొని తింటూంటే చీమ తలకాయంత ముక్కు చెట్టుతొర్రలో పడిపోయింది. తీసి పెట్టమని వడ్రంగి నడిగితే తీయనన్నాడు. కావున  వడ్రంగిని  దండించు  రాజా" అని  అంది. 

రాజుకూడా నవ్వి , "ఇంత  చిన్న పనికి వడ్రంగిని దండించాలా?  దండించను   పో" అని  అన్నాడు రాజు.
"అమ్మా విడిపని ఇలా వుందా!"  అని  ఆ  పిచిక  వెంటనే  లేళ్ల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి," చెట్టు కొట్టి మంటే వడ్రంగి కొటానన్నాడు. వడ్రంగిని దంచించమంటే రాజు దంచించలేదు. రాజుకు ఉద్యానవనమంటే ఎంతో ఇష్టం. అది పాడుచేయండి లేళ్ళూ!" అంది. 
"ఈ చిమటలకాయంత రొట్టిముక్కకి చక్కటి రాజు పూలతోట పాడుచేస్తామా? చాలు, చాలు పో," అన్నాయ్ లేళ్లు. 
"అమ్మ! వీటమ్మ కడుపు కాలా! ఈ 












































Thursday, June 11, 2020

మళ్ళీ జన్మంటూ ఉంటే.....

మళ్ళీ జన్మంటూ ఉంటే.....

నాపేరు name different. మేము ఉండేది విశాఖపట్టణం జిల్లాలోని సింహాచలం. మా నాన్నగారు సోమయాజులు గారు దేవాదాయశాఖలో గుమాస్తా. నాకు ఒక అన్నయ్య, ఇద్దరు అక్కలు. మా నాన్నగారు మా నలుగురికి చక్కటి విద్యాబుధ్ధులు నేర్పించే ప్రయత్నం చేసారు. మా అన్నయ్యకు చదువు వంటబట్టలేదు. వరాహలక్షీనృసింహ స్వామి వారి దేవస్థానంలో (సింహాచలం దేవస్థానం) మానాన్నగారు తన పలుకుబడి ఉపయోగించి మా అన్నయ్యకు అటెండర్ ఉద్యోగం వేయించారు. నా ఇద్దరు అక్కలు ఇంజినీరింగ్ పూర్తి చేసారు. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నాను.

మా పెద్దక్కకు పూనేలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న వ్యక్తితోనూ, నా చిన్నక్కకు నొయిడాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న వ్యక్తితోనూ వివాహం జరిపించారు. నా అన్నయ్యకు సంబంధాలు చూస్తున్నారు. నేను ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను. 

మా నాన్నగారికి అకస్మాత్తుగా పక్షవాతం వచ్చింది. వలంటరీ రిటైర్‌మెంట్ తీసుకోవలసి వచ్చింది. నాన్నగారికి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులో సగం డబ్బుతో ఒక ఇల్లు కొన్నారు. మిగిలిన డబ్బు నాన్నగారి వైద్యానికి, అన్నయ్య పెళ్ళికి, ఇంట్లో అవసరమైన సామాన్లు కొనటానికి దాదాపుగా ఖర్చు ఐపోయింది. నాన్నగారికి వస్తున్న పెన్సన్ తోనే ఇల్లు గడుస్తుంది. అన్నయ్యకు వివాహం ఐనప్పటినుంచి ఒకే ఇంట్లో ఉంటున్నా, తన ఉద్యోగం, తన భార్య, తన సంపాదన తప్ప, అమ్మానాన్నలను నన్ను అంతగా పట్టించుకోవటం లేదు. నా చదువు అటకెక్కింది. నాకు వివాహం ఎలా జరిపించాలి అని రోజూ అమ్మానాన్న తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

సింహాచలం లో నివాసం ఉంటున్న మా నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు సోమనాథ శాస్త్రి గారు విషయం తెలిసి సతీసమేతంగా మా నాన్నగారిని పరామర్శించటానికి మా ఇంటికి వచ్చారు. ఆమాటా ఈమాటా మాటాడుకున్న తరువాత ఒక పైసా కట్నం తీసుకోకుండా నన్ను తమ ఇంటి కోడలిని చేసుకుంటాము అన్నారు. మాకు ఇబ్బందిగా ఉంటే పెళ్ళి ఖర్చులు కూడా తామే భరిస్తాము అని చెప్పారు. సోమనాథ శాస్త్రి గారు జ్యోతిష పండితులు. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. వారి కూతురుకి ఈమధ్యనే సింహాచలం దేవస్థానంలో అర్చకునిగా పనిచేస్తున్న వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. వారి కొడుకు రామకృష్ణ శాస్త్రి. చిన్న వయసులోనే వాస్తు, జ్యోతిష్యం, మంత్రశాస్త్రములపై మంచి పట్టు సాధించాడు. బారసాల మొదలుకుని సహస్రచంద్రదర్శనం వరకూ ఏకార్యక్రమమైన చక్కగా శాస్త్రప్రకారం నిర్వహించగలడు అని మంచిపేరు కొద్దికాలంలోనే తెచ్చుకున్నాడు. చాలా నిరాడంబరుడు. ఎక్కడికైనా నడిచి కాని, సైకిల్ మీద కాని, బస్సుల మీద కాని వెళ్తాడు. పూర్వీకులు సంపాదించిన ఆస్థి తన తండ్రిగారి వాటాకు ఓ ఐదెకరాల పొలం వచ్చింది. రాకమృష్ణశాస్త్రి ఆపొలం లో స్వయంగా పంటలు పండిస్తున్నాడు. 

మా నాన్నగారు నా ఇద్దరు అక్కలకు, అన్నయ్యకు ఈవిషయం చెప్పారు. వారు ఎంతమాత్రం సమ్మతించలేదు. నన్ను అడిగారు. నేను సరే అన్నాను. ఎందుకు సరే అంటున్నావు కారణాలు చెప్పగలవా అని అన్నయ్య, అక్కయ్యలు నన్ను అడిగారు. అక్కయ్యలిద్దరూ దూరంగా ఉంటున్నారు, నేను అమ్మానాన్నలకు దగ్గరగా ఉండొచ్చు అని, ప్రస్థుత పరిస్థితులలో నాన్నగారు డబ్బు ఖర్చు పెట్టలేరని, నాన్నగారి చిన్ననాటి స్నేహితుని ఇంటికి కోడలిగా వెళ్తున్నాను కాబట్టి అవసరమైతే నా అత్తింటివారు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తారని చెప్పాను. అలా నా వివాహం జరిగింది.

వివాహం జరిగి అత్తారింటికి వచ్చిన నాకు పుట్టింటికంటే ఆనందంగా ఉంది. అత్తమ్మ, ఆడపడుచు చాలా మంచివారు. రెండు మూడు రోజులకు ఒకమారైనా నన్ను పుట్టింటికి పంపుతున్నారు. మావారికి వరాహ పుష్కరిణిలో స్నానం ఆచరించి, భైరవకోనకు వెళ్ళి, భైరవస్వామివారిని దర్శించుకోవటం నిత్యకృత్యం. ఒకరోజు రాత్రి నిద్రపోయేముందు ఏవండోయ్ శ్రీవారూ! రోజూ మీరొక్కరే వెళ్తారా? నన్ను తీసుకుని వెళ్ళరూ అని అడిగాను. సరేనోయ్, రేపు ఉదయం 5 గంటలకు సిధ్ధంగా ఉండు, వెళ్దాం అన్నారు.

తెల్లారి నిద్రలేచి అత్తమామలకు చేయాల్సిన ఏర్పాట్లు చేసి ఐదు గంటలకల్లా సిధ్ధంగా ఉన్నాను. శ్రీవారు తయారై వచ్చారు. సైకిల్ ఎక్కి కూర్చేవే అన్నారు. హాండిల్ కి సీట్ కి మధ్య ఉన్న పైప్ మీద కూర్చున్నా. శ్రీవారు సైకిల్ తొక్కటం ప్రారంభించారు.

ఇంటి నుంచి పుష్కరిణి కి వెళ్ళటానికి పట్టిన సమయం దాదాపు 8 నిముషాలు. ఈ సమయంలో మాశ్రీవారికి, నాకు జరిగిన మధుర సంభాషణలు ఎన్నటికీ మరువలేను. పుష్కరిణిలో స్నానమాచరిస్తున్నప్పుడు నాకు శ్రీవారు జాగ్రత్తలు చెబుతూ ఉంటే నేను మావారి మీదకు నీళ్ళు విసురుతూ, మావారు నా తల మీద చెయ్యి వేసి నన్ను ముంచుతూ ఎంతగానో ఆనందించాము. స్నాన, సంధ్యాదులు ముగించుకున్నాక తిరిగి సైకిల్ ఎక్కి కూర్చున్నాను, కబుర్లు చెప్పుకుంటూ భైరవకోనకు వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాము. ఇంతకుముందు ఎన్నో మార్లు వరాహపుష్కరిణికి, భైరవకోనకు వెళ్ళినప్పటికీ ఈరోజు పొందిన ఆనందం ఎన్నటికీ మరువలేను. మావారిని నాకొక సైకిల్ కొని ఇస్తే కొన్ని కొన్ని పనులకు వెళ్ళటానికి అలానే నా పుట్టింటికి వెళ్ళటానికి నాకు సౌకర్యంగా ఉంటుందని అడిగాను. ఓ మంచిరోజు చూసి నాకు సైకిల్ కొని ఇచ్చారు. 

రోజులు గడుస్తున్నాయి. మాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఇంటి పనులు చూసుకుంటూ, పిల్లల పెంపకంలో శ్రధ్ధవహిస్తూ బిజీ ఐపోయాను. నా పెద్దకొడుక్కి సరస్వతీవిద్యామందిర్ లో చేర్పించాము. రోజూ నేనే సైకిల్ మీద తీసుకుని వెళ్ళి స్కూల్ దగ్గర దించి తిరిగి వస్తున్నాను. ఇలా ఉండగా మా నాన్నగారు చనిపోయారు. అక్కయ్యలిద్దరూ వచ్చారు. చాలా బాధగా ఉంది. రాత్రికి ఆకలి వేస్తుంది. కాని భోజనం చేయాలని లేదు. పెద్ద బావ గారు వచ్చారు. పెద్దక్క కుటుంబం అంతా బయటకు వెళ్ళారు. పెద్దబావ గారు రెస్టారెంట్ కు తీసుకుని వెళ్ళారట. అక్కడ మా పెద్దక్క బాధతో ఏమీ తినలేదట. మా పెద్దబావ గారు, వారి పిల్లలు తినేసి వచ్చారట. చిన్నబావ గారి బంధువులు సింహాచలం లో ఉన్నారు. వారింటికి చిన్నక్క కుటుంబం వెళ్ళింది. చిన్నక్క కూడా చాలా బాధ పడుతుంది. ఒకటి రెండు మార్లు భోజనం చెయ్యమని చిన్నక్కను అడిగి తను తినటానికి ఇష్టపడకపోగా మిగిలినవారంతా తిన్నారట.

నేను మా ఇంటికి వచ్చాను. స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. ఆడపడుచు అప్పటికే వచ్చి వంట చేసి అత్తమ్మకు, మామగారికి, పిల్లలకు బోజనం పెట్టేసింది. శారదా బోజనం చేస్తావా? ఎప్పుడు తిన్నావో, ఏమిటో అంది. నువ్వు, మా తమ్ముడు మీరిద్దరే బోజనం చెయ్యాలి అంది. నా భర్త నాకోసం భోజనం చెయ్యకుండా ఉన్నారా అని ఆశ్చర్యం వేసింది. ఇంతలో నా శ్రీవారు, పిల్లలు, అత్తమ్మ-మామ గారు అంతా నేను-నా ఆడపడుచు ఉన్న గదిలోకి వచ్చారు. శారదా! బాధపడుతూ కూర్చుని తినకుండా ఉంటే నీరసం ఐపోతావే, తిను అంటూ అత్తమ్మ ప్రేమగా నా తలపై నిమిరి అన్నం ముద్దచేసి నా నోట్లో పెట్టింది., తరువాత నా ఆడపడుచు, నా పిల్లలు ఒక్కరొక్కరే ఏదో ఒకటి చెబుతూ నాకు అన్నం తినిపిస్తుంటే, లక్షలు కోట్లు సంపాదిస్తున్నా కనీసప్రేమాభిమానాలు లేని కుటుంబంలో ఉన్న నా ఇద్దరు అక్కలకంటే నేను ఎన్నోరెట్లు ధనవంతురాలినా అనిపించింది. మావారు, మా మామగారు రోజూ నా పుట్టింటికి వస్తూ అక్కడ జరపాల్సిన కార్యక్రమాలు జరిపిస్తున్నారు. 10 వ రోజు కార్యక్రమం పూర్తి అయ్యాక అక్కయ్యలిద్దరు వెళ్ళిపోయారు.

మావారికి మంచి పేరుప్రఖ్యాతులు రోజు రోజుకూ వస్తున్నాయి. నేను రోడ్డు మీదకు వెళ్ళినప్పుడళ్ళా ఎవరో ఒకరు పలానా పురోహితుని భార్య అని నన్ను గుర్తిస్తూ పలకరించి మాటాడుతున్నారు. నా ముగ్గురు పిల్లలను అంతా ముద్దుచేసేవారే. ఎవరింట్లో శుభాకార్యం జరుగుతున్నా మొట్టమొదట పిలిచేది మా అత్తమ్మను, నన్నే. మావారి సంపాదన కూడబెట్టి ఇల్లు పెద్దగా కట్టించుకున్నాము. ఇప్పుడు మా ఇంటికి ఏసమయంలో నైనా ఓ పదిమంది అనుకోని అతిథులు వస్తే వారికి వసతి, బోజన సౌకర్యాలు ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నాము. మా ముగ్గురు పిల్లలూ ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నారు.

ఉదయం లేచి అత్తమామలకు కావలసినవన్నీ ఏర్పాటు చేసాను. శ్రీవారు పౌరోహిత్యానికి వెళ్ళారు. సైకిల్ కి ముగ్గురు పిల్లల పుస్తకాల సంచీలు తగిలించి, నా కూతురుని సైకిల్ మీద కూర్చుండబెట్టి సైకిల్ నడుపుతున్నాను. నా ఇద్దరు కొడుకులూ నడుస్తూ నా వెంట వస్తున్నారు. నా పిల్లలు చదువుతున్న స్కూల్ సరస్వతీ విద్యా మందిర్ ఎదురుగా ఉన్న రామాళయం వచ్చింది. పాపను సైకిల్ మీద నుంచి దించాను. పిల్లలు ముగ్గురూ తన పాదరక్షలు విడిచి రామాళయం లోనికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి తమ పాదరక్షలు ధరించి ఎవరి పుస్తకాల సంచీ వారు తీసుకుని స్కూల్ లోనికి వెళ్ళి పోయారు. సైకిల్ స్టాండ్ వేసి రామాళయం లోనికి వెళ్ళి స్వామీ! సీతా, లక్ష్మణ, హనుమత్సమేత శ్రీరామచంద్రా! నాకు ప్రసాదించిన ఈ అదృష్టం చాలు. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే ఒక పురోహితునికి కూతురుగా, ఒక పురోహితునికి భార్యగా, ఒక పురోహితునికి తల్లిగా. ........... జన్మించేటట్టు అనుగ్రహించు అని అర్ధించి, దేవాళయం బయటకు వచ్చి, నా సైకిల్ తీసుకుని ఇంటివైపు బయలుదేరాను.

Wednesday, June 10, 2020

శ్రావణి పుట్టింటికెళ్లి సంవత్సరం కావొస్తుంది

శ్రావణి పుట్టింటికెళ్లి సంవత్సరం కావొస్తుంది. తండ్రి పోయాకా...మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కనేలేదు. మూడేళ్ళ క్రితం తల్లి చనిపోవడంతో...పుట్టింట్లో తనకున్న చనువు తగ్గిపోయినట్లు అయింది.తన తండ్రి వున్నా కుశల ప్రశ్నలు వరకూ అడిగి మాట్లాడగలరు గానీ...కూతురు అచ్చటా ముచ్చటా చూడగలిగేదీ...కష్టం,సుఖం తీర్చగలిగేది తల్లి మాత్రమే.అలాంటి తల్లి దూరమైనప్పుడు పుట్టింటి ప్రతి ఆడపడుచూ అణిగి మణిగి ఉండాల్సిందే....!
శ్రావణికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అన్నయ్య,వదినా ఉద్యోగస్తులు కావడంతో...వారు తన తండ్రికి భోజనసౌకర్యాలు అమర్చిపెట్టినా...ఇంకా ఆయనకు చక్కబెట్టాల్సిన పనులను మాత్రం పెద్దగా పట్టించుకునేవారు కాదు.అయినా..ఆయనెప్పుడూ ఎవరిచేతా ఏ పనీ చేయించుకోలేదు. పని అలవాటు లేకపోయినా అవసరం అలవాటు పడేలా చేస్తుంది.భార్య లేకపోయినా.. తన పనులు తాను కానిచ్చుకుని...తన తండ్రి జ్ఞాపకార్ధం గా ఉంచుకున్న చెక్క వాలు కుర్చీలో అలసటగా నడుం వాల్చి సేదతీరేవారు.భార్య మరణిస్తే..భర్తకొచ్చే కష్టాన్ని కళ్లారా చూసింది శ్రావణి. అన్నయ్యా,వదినా తన తండ్రిని సరిగా పట్టించు కోవడం లేదనే బాధతో ... అదే విషయాన్ని అన్నయ్యని నిలదీసి అడిగింది.పుట్టింటి గడప దాటి వెళ్లిన ప్రతి ఆడపిల్లా... మరీ అంత జోక్యం చేసుకోడం మంచిది కాదేమో...?దానితో ఆ అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్థలు వచ్చాయి. "నీవేమైనా ఆయన్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటావేమో తీసుకెళ్లి చూసుకో" అంటూ కోపంతో పెద్దపెద్ద కేకలేశాడు. తండ్రి ఆ గొడవంతా విని..."నీకు నామీదున్న ప్రేమతో నీకలా అనిపిస్తుంది గానీ...మీ అన్నయ్యా వదినా నన్ను బానే చూసుకుంటున్నారమ్మా" అని కొడుకునీ,కోడలనీ వెనకేసుకొచ్చారు. అన్నయ్య తిట్టినందుకు బాధ పడలేదు శ్రావణి .తన తండ్రి మధనం లో ...వారెలా చూసినా కడవరకూ వాళ్ళే కదా నాకు దిక్కు అన్నట్టుగా అనిపించి ..మనసంతా బరువుగా అయిపోయింది శ్రావణికి. అన్నయ్య కోరిక మేరకు తండ్రిని తన ఇంటికి తీసుకుపోయి ప్రేమగా చూసుకోవాలని మనసారా వున్నా...తండ్రి కప్పిపుచ్చిన తన పుట్టింటి పరువుని అత్తింట్లో చులకన చేయాలనుకోలేదు. ఎవరినీ బాధ పెట్టడం ఇష్టం లేకనో ఏమో...ఆ వాదన జరిగిన నెల్లాళ్లకే...తండ్రి చనిపోయారు.ఆయన కర్మకాండలు అవ్వనిచ్చి తన ఇంటికి ప్రయాణమై వెళ్తూ...ఇంక నాకూ ఆఇంటికీ బంధం తీరిపోయింది అనుకుంది శ్రావణి.
ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది శ్రావణికి. "పదిరోజుల్లో నాన్న సంవత్సరీకం వస్తుంది. నువ్వూ,బావగారూ తప్పకుండా రావాలి "అంటూ. తల్లీ తండ్రీ లేని పుట్టిల్లు ఇక మనది కాదనుకున్న ప్రతిఆడపిల్లా ...కాకితో కబురొచ్చినా...అన్నీ మర్చిపోయి 
పరుగెత్తుకుని వెళ్లిపోవాలనుకుంటుంది.
గతం గతః– అనుకుంది శ్రావణి. అన్నయ్యా వదినతో పూర్వం లా కలిసిపోవానుకుని....భర్తతో కలిసి పుట్టింటికి వెళ్ళడానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంది.
తనపుట్టిల్లు కళ్ళముందు మెదులుతుంటే...
ఎంతో గర్వంగా అనిపించింది.అమ్మా , నాన్నా కలల ప్రతిరూపమైన ఆ ఇంటి డాబా మీదకు ఎగబాకిన బొగనవిలియా కొమ్మలు గుత్తు గుత్తులుగా వున్న పూలతో గమ్మత్తుగా గాలికి ఊగుతుంటే...చూడటానికి ఎంత ఇష్టంగా ఉండేదో...! పోర్టికోలో పచ్చ సంపెంగలైతే సువాసనతో దారిన పోయేవాళ్ళ ముక్కుపుటాలను అదరకొట్టేవి. ఆఇంటి పెరట్లో....ఉసిరి,మామిడి,జామ, 
సపోటా, అరటి ఇంకా చాలా చాలా పళ్ల చెట్లతో కళకళ లాడే పచ్చతోరణాల్లా వుండేవంటే ...అదంతా తన తండ్రి అభిరుచే. ఆ చెట్ల నుంచి రాలే ఆకుల్నీ,పూలనీ పొడవాటి కొబ్బరి చీపురు తో రెండు పూటలూ అమ్మ తుడుస్తూ ఉంటే....ఆ సేవకు భూదేవి తన తల్లికెన్ని దీవెనలు ఇచ్చిఉంటుందో..? అమ్మ తెల్లవారుజామునే లేచి వాకిట్లో ముగ్గువేసేది ఏమో...లక్ష్మీదేవికి నివాసంలా అనిపించేది.
అలాంటి పుట్టింటిని శ్రావణి ఎలా మర్చిపోగలదు? ఆ ఇంటికోసం తన తల్లీతండ్రీ పడిన శ్రమ గుర్తుకొస్తుంటే...ఆ ఇంటినెప్పుడెప్పుడు చూసుకుందామా అన్న తపన ఎక్కువైపోయింది శ్రావణి కి. అమ్మా , నాన్నా వాడిన వస్తువులను తనివితీరా చూసుకోవాలనీ... ఎప్పుడో అమ్మ పట్టుకెళ్లమని చెప్పిన అటక మీద ఇత్తడిసామానుతోపాటూ...వీలైతే నాన్న జ్ఞాపకార్థంగా ఆయన వాడిన చెక్క వాలుకుర్చీని తెచ్చుకోవాలి–మనసులో అనుకుంది శ్రావణి.
ఎంతో అభిమానంతో పుట్టింటికి వెళ్లినశ్రావణి కి ...వెళ్ళగానే ఆఇంటి అరుగు మీద నాన్న కూర్చునే వాలుకుర్చీ కనిపించలేదు.కనిపిస్తే.. తన తండ్రి పలకరించినట్లుగా ఫీలయ్యేదేమో...?ఆ అరుగంతా బోసిపోయినట్లు వుంది. పెరట్లోచెట్లూ, వీధిలో బొగనవిలియా అన్నీ కూడా తలల వరకు నరికేసి వున్నాయి.ఆ ఇంటి పచ్చదనం అంతా హరించుకుపోయింది. అదేమిటి అలా ఎందుకు చేశారని అడిగితే....ఆ చెట్ల ఆకులూ, పూలు తుడవాలంటే...ఆ ఇంట్లో పనిచేయడానికి ఎవరూ రామంటున్నారనీ,అందుకే ఎందుకొచ్చిన గొడవని కొమ్మలన్నీ కొట్టించేసామనీ ఎంతో రిలీఫ్ గా మాట్లాడారు. ఆ సమాధానం విని...తల తిరిగినట్లైంది శ్రావణి కి.ఆ ఇంటికి కళా కాంతీ లేకుండా చేసిన వారి మీద చెర్రెత్తికొచ్చినా.. తమాయించుకుంది. మనసులోనే భారంగా నిట్టూర్చి ...ముఖంపై రాని చిరునవ్వుని పులుముకుని...ఇంట్లోకి నడిచింది. ప్రయాణిక బడలిక వల్లనేమో కాసేపు అమ్మా నాన్నా వాడిన పందిరిమంచంపై పడుకుని..వారి ఒడిలో పడుకుని జోల పాడించుకున్నట్టుగా అనుభూతి చెందాలనుకుంది. అటకపైకి తొంగి చూసి అమ్మ ఇస్తానన్న ఇత్తడి సామాన్ని కిందకి తీయాలనుకుంది. నాన్న వాలుకుర్చీని ప్రేమగా తడమాలనుకుంది. ఊహూ... ఇవేమీ ఆ ఇంట్లో కనిపించలేదు.ఇల్లంతా కొత్త ఫర్నీచర్తో నిండిపోయి వుంది. అవేమీ కళ్ళకింపుగా అనిపించలేదు శ్రావణికి.
మర్నాడు...తనతండ్రికి జరపాల్సిన పిండ ప్రధాన కార్యక్రమాలన్నీ ఘనంగానే జరిపించారు. బంధుమిత్రుల రాకతో...వారి పలకరింపుతో శ్రావణి మనసుకి కాస్త ఊరాట కలిగింది. 
ఆ సాయంత్రం ఊరు బయలుదేరుతూ ....తాను దొంగాటలు, కోతి కొమ్మచ్చెలు ఆడుకున్న దొడ్డినంతా కలియచూద్దామని వెళ్లిన శ్రావణి కి –ఇంటి వెనుక భాగంలో పాడుబడ్డ సామాను వుండే రేకుల షెడ్డు లో పడేసి కనిపించాయి...ఆ పందిరి మంచం,చెక్క వాలు కుర్చీ.వాటిని చూడగానే .. శ్రావణి కళ్ళు తడిబారకుండా వుండలేకపోయాయి.ఇత్తడి సామాల్ని కూడా ఏ షావుకారుకో భేరం పెట్టేసి ఉంటారని అర్థం అయింది.మరేమీ మాట్లాడకుండా...తన ఇంటికి ప్రయాణమై వచ్చేసింది భారమైన మనసుతో.
శ్రావణి లో ఏం జ్ఞానోదయం అయిందో ఏమో....తను నోచుకోని అదృష్టాన్ని కనీసం తన భర్త కళ్ళల్లోనైనా కనిపించాలనుకుంది. ఇంటికి వస్తూనే.. అటకమీదకెక్కించిన అత్తగారి వయోలిన్,బోశానం పెట్టె, మావగారి చెక్క బట్టల స్టాండ్లను కిందకి తీయించి...మ్యూజియం లో వస్తువుల్లా ..వాటికి పూర్వపు కళ వచ్చేలా శోభామయంగా తీర్చిదిద్దింది.
ఇంట్లో పెద్దవాళ్ళు కనుమరుగైనా... వాళ్ళు వాడిన వస్తువుల్లో వారి ప్రతిబింబాలు ఎప్పుడూ కనిపిస్తూనే వుంటాయని తెలిసొచ్చింది పుట్టింటికెళ్లివచ్చిన శ్రావణికి. 
చనిపోయిన తనతల్లిదండ్రులకు ఈ విధంగా కూడా తన భార్య విలువ ఇస్తున్న ఆమె అంతరంగాన్ని ముచ్చటగా చూసాడు ఆమె భర్త.

Monday, June 8, 2020

కష్టాలు ఎవరికి లేవు

🌷కష్టాలు ఎవరికి లేవు🌷

ఇతను బాగా బతికిన భక్తుడు అని ఒకరి గురించి చెప్పండి ఎవరూ లేరు, అయినా వారి జీవితాలు ఆదర్శంగా చెప్పుకుంటున్నాము కానీ ధనికులు గురించి చరిత్ర రాసుకుని చెప్పుకోవడం లేదు గమనించండి శాశ్వత మైనది ఆధ్యాత్మిక సంపద ఒక్కటే, విలువలు కోసం బతికిన వారే చరిత్రలో గొప్పవాళ్లుగా మిగిలిపోయారు.. తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు తినడానికి తిండి లేని రోజులు ఉన్నాయి ఒకసారి ఉత్సవానికి ముందు రోజు ఆ పరమేశ్వరుడు మారు వేషంలో ఆయన ఇంటి ముందు ధాన్యం ఉంచి వెళ్లారు అని చెప్తారు, త్యాగయ్య, రామదాసు, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, వీరి జీవితాల్లో కష్టాలు కన్నీళ్లు అనారోగ్యం లేదా.. ఇప్పుడు మీకు ఉన్న స్థితి సంతోషం కనీస సౌకర్యాలు కూడా వారికి లేదు కానీ ఎన్నో కోట్ల మంది జీవితాలకు వెలుగు నింపిన వారు ఈ రోజుకి వీరి పేర్లు వింటే భక్తితో నమస్కారం చేస్తారు కారణం జీవితాన్ని ఆధ్యాత్మికం వైపు సాగిస్తూ యదార్దాన్ని అంగీకరించారు వాస్తవంలో బతుకుతూ ఊహ లోకాలకు వెళ్లకుండా దేవుణ్ణి నిందించకుండా వారి కర్మలు వదిలించుకుని వారు పొందిన చైతన్యాన్ని లోకానికి పంచి మహానుభావులు ఐయ్యారు ఎందరో మహానుభావులు.

 శ్రీ రాముడు మనము కొలిచే దేవుడు మానవ ప్రయత్నం తోనే ప్రతి కష్టాన్ని దాటుకుంటూ వచ్చాడు రుద్రాది దేవతలు కూడా రామ నామం జపించే అంత గొప్ప స్థాయికి ఒక మానవుడిగా బతికి చూపించాడు. అంతఃపురం లో  రాజ భోగాలు అనుభవించే మహా రాజు అడవిలో ఆ చెట్ల మధ్య ఎండ వాన చలికాలం లో ఆ అడవిలో బతికాడు భార్యను అపహరిస్తే ఆయన  పడ్డ బాధ కష్టం అవమానం నిద్రాహారాలు మాని ఎంత కష్టాన్ని భరించాడు, సీతమ్మ తల్లి ఎన్ని బాధలు పడింది ఆమెను అవమణిస్తూ తన భర్తని దూషిస్తూ ఆ మాటలు ఎంత కష్టంగా 10 నెలలు పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎంత రోదించి ఉంటుంది ఒకసారి రాముడి తల అని చెప్పి మాయను సృష్టించి ఆమెకు చూపించారట ఆమె గుండె పగిలేలా ఎడిచిందట రాజ్యాం ఉండి రాముడు అడవిలో బతక లేదా, రాముడు లాంటి భర్త ఉండి సీత కష్టాలు పడలేదా అగ్ని ప్రేవేశం గురించి మాట్లాడుతారే ఈ రోజుకి నా తల్లి అగ్ని పునీత అని అందుకే కధ చెప్పుకుంటున్నాము.. 

రాఘవేంద్ర స్వామి ప్రకృతిని తన స్వాధీనం లోపెట్టుకున్న మహా గొప్ప ఉపాసకుడు మట్టిని బంగారం చేయగల మంత్ర శక్తి కలిగిన మహానుభావుడు కానీ కర్మను అనుసరించి కటిక దారిద్ర్యం అనుభవించాడు కానీ తన మహిమలు స్వలాభం కోసం వాడుకోలేదు. 

ఉన్నదంతా దైవాకార్యం కోసమే ఖర్చుపెట్టి తినడానికి తిండి లేక యాచించే పరిస్థితి లో రామదాసు భార్య కూడా ఆయనతో పాటు యాచించడానికి సిద్దపడింది కానీ అతని భక్తిని నిందించలేదు ఆమె  అక్కన్న మాగన్నలకు పెంపుడు కూతురు అల్లారు ముద్దుగా విద్యా బుద్దులతో పెరిగింది తన భర్తకు లేని భోగాలు తనకు అవరసం లేదు అని పుట్టింటి వాళ్ళు పిలిస్తే వెళ్లకుండా భర్త తో పాటు జోలె పట్టుకుని యాచించడానికి సిద్దపడింది కానీ కష్టంలో భర్తను వదల లేదు నిందించ లేదు తర్వాత తనిషా ప్రభువు దగ్గర ఉద్యోగం ఇప్పించారు..

పరమాచార్యులు వారు కామాక్షి స్వరూపం మన జాతి గౌరవం సన్యాస ధర్మానికి నిర్వచనం ఆయన పేరు తలుచుకున్న పాపాలు తొలగిపోతాయి.. ఆయన బాధలు పడలేదా అనారోగ్యం రాలేదా.. 

రామకృష్ణ పరమహంస బాల్యంలో నే భక్తి పట్ల వారి ప్రవర్తన గమనించి తల్లిదండ్రులు వివాహం చేసేసారు కానీ భార్య మొహం కూడా చూడకుండా అదే రాత్రి ఏటో వెళ్లిపోయారు పెళ్లి అయిన రోజే మొగుడు వదిలి వెళ్లిపోయారు అని లోకం తెలియని వయసులో పెళ్లి అయిన ఆ అమ్మయిని ఎందుకు కాకులు లాగా పొడుస్తున్నారు కూడా ఆమెకు అర్థం కాని వయసు తర్వాత ఎప్పటిలో రామకృష్ణ గారు బాగా ప్రసిద్ధ పొంది వారి పెరు అందరికి తెలిసాక ఆమె బట్టలు సర్దుకుని ఆశ్రమానికి వెలింది అక్కడ రోజుకు ఒకరికి గురువుకు సేవ చేసే అవకాశం ఇస్తారు   శారాధమ్మ వంతు రావడానికి 2 సం కాలం పట్టింది ఆ రోజు ఆమె అన్ని సపర్యలు చేసి వారి పాదాలు ఒత్తుతూ ఆమె తన భార్య ని తన పేరు శారదా అని పరిచయం చేసుకున్నారు ఆశ్చర్య పోయిన రామకృష్ణ గారు వివరాలు తెలుసుకున్నారు తను వచ్చి 2 సం అయిన ఒక శిష్యురాలు గా ఉన్నదే కానీ ఏ నాడు నేను నీ భార్యని అని చెప్ప లేదు ఎందుకు ద్రోహం చేశారు అని నిలదీయ లేదు ఆక్షణం ఆమె సాక్షాత్తు పరాశక్తి లాగా కనిపించింది ఆ ఔదార్యం సహనం అందరికి సాధ్యం కాదు రామకృష్ణ గారికి ఎంతో ఉన్నతమైన ఆమెను చూసి ఆనందం కలిగింది  ఆమె ఏమీ కోరలేదు తనని ఆశ్రమంలో ఒక భక్తురాలిగా ఉండనిస్తే చాలు మీ ఆధ్యాత్మిక మార్గానికి నేను అడ్డురాను అని కోరుకుంది అందరికి ఆమెను తన భార్యగా పరిచయం చేసి ప్రతిరోజు ఆమె తనకి సేవ చేయని చెప్పారు అదే వరం అనుకున్నది ఆమె కానీ అంతటి స్థితప్రజ్ఞత ఉన్న ఆమె  సాధారణ స్త్రీ మూర్తి కాదు అని ఆమెకు అమ్మవారిలాగా అలంకారం చేసి పూజ చేసే వారు రామకృష్ణ గారు.వారిరువురూ వివాహం అయిన బ్రహ్మచారులు. 

ఇలా మనము గొప్పగా చెప్పుకుంటున్నా ఎవరి చరిత్ర చూసిన వాళ్ళు ధనికులు అని గొప్పగా చెప్పడం లేదు వారి విలువలు జినవ విధానం అంత ఉన్నత స్థానంలో నిలిపింది మేము బాగా పూజలు చేస్తాము మాకు ఎందుకు అనారోగ్యం వచ్చింది అని అడుగుతారు అనారోగ్యం తెచ్చుకునే ఆహారపు అలవాట్లు గుర్తు ఉండదు అయిన కర్మను భరించడానికి శక్తిని కోరుకోవాలి అది వదిలించుకునే దానికే పుట్టా ము అని గుర్తు ఉంచు కోవాలి.. మన తల్లిదండ్రులు, భాగస్వామీ మన పిల్లలు పరిసరాలు ఇవన్నీ చూస్తే మనము ఎలాంటి కర్మ చేసుకుని పుట్టి ఉంటాము ఎవరూ చెప్పకుండా అర్థం అయిపోతుంది. 

ఎంత కష్టంలో కూడా మళ్లీ తప్పు చేయకుండా ఉంచమని  కోరాలి, మళ్ళీ పాప  కర్మలు చేయకుండా ఉంచినందుకు భగవంతుడు కి కృతజ్ఞతతో నమస్కారం చేయాలి, కష్టాన్ని దాటించే నావలాగ భగవంతుడు ని తోడు కోరాలి కానీ కష్టమే రాకూడదు అంటే నువ్వు అంత పుణ్యం చేసి ఉంటే నీకు జన్మ అనేది ఉండదు పుట్టావు భూమి పైన అంటే అది ఋణం తీర్చుకోవడానికి. దేవుడైన కర్మ భూమిలో పుట్టి కష్టాలుతప్పించు కోలేదు.. దాటలేని కష్టం అంటూ ఏది లేదు మనము పటించుకుంటే కష్టం దానిగురించి ఆలోచించడం మానేసి చేయాల్సిన కర్తవ్యం చేసుకుంటూ పోవాలి, అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు కష్టాలు కూడా కరిగిపోతుంది.. మీ రందరు ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు గైయ్యాలి భార్య నువ్వు చేసుకున్న కర్మ, బాధ్యత లేని భర్త నువ్వు చేసిన పూజ పుణ్యం యొక్క ఫలితం, బిడ్డలు మీరు చేసిన ఋణాలు, దానాలకు ఫలితం, తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మ కార్యాలకు ఫలితం, వృత్తి వ్యాపారం స్నేహం ఇవన్నీ మీకున్న భూత దయకు రునబందాలు కనుక నువ్వు ఎవ్వరినీ నిందించ డానికి అవకాశం లేదు ఎందుకంటే కోపం తో ఒక మాట అయితే అందరూ అంటాము నా కర్మ కొద్దీ దొరికావు అని అది నిజం మన పుణ్య పాప కర్మలు మనల్ని బాధించి కర్మనుండి ఆ పాపం నుండి విముక్తి కలిగిస్తుంది.  మన పాపాల రూపం వీళ్ళ రూపంలో ఉంది మన పుణ్యం వీరి రూపంలో ఉంది. అని వాళ్ళను భరించే శక్తిని భగవంతుడు ని కొరుకుని , నిత్యం నామాజపం తో కొత్తగా ఏ పాప కర్మలు చేయకుండా జీవితాన్ని ఉన్నంతలో ఉన్నతంగా జీవిద్దాము.. చేతనైవ  సహాయం చేద్దాము ఒకరికి సహాయం చేయక పోయిన ఒకరికి ద్రోహం చేయకూడదు ఒకరి గురించి మంచి చెప్పక పోయిన చెడు ప్రచారం చేయకూడదు.. అసూయ, అహంకారం చాలా ప్రమాదం అవి మనకు శత్రువులు వాటిని వదిలేద్దాము. ఒకడు కుబేరుడు గా భోగాలు అనుభవిస్తున్నారు అంటే అది వారి గత జన్మ ఉపాసన పుణ్య ఫలితం దేనికైనా ఫలితం ఉంటుంది అది పొందాల్సిందే ,అయితే మనము ఏది మూతకట్టుకుంటామో అదే మనము మిగులుతుంది. 

కర్మల నుండి విముక్తి కలిగించే శక్తి ఒక్క మంత్ర సాధనకే ఉంటుంది ఎందుకంటే మంత్రం లో  ప్రతి బీజం ఆమె దైవ స్వరూపంగా ప్రకృతిలో శక్తిని మనము ఆకర్షించే విధంగా చేస్తుంది మన కర్మల నుండి విముక్తి కలిగిస్తుంది దీని గురించి వివరంగా ఇంకో టపా లో తెలుసుకుందాము..

🌷శ్రీ మాత్రే నమః🌷

దైవాన్ని ఆరాధిస్తున్నా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి?

దైవాన్ని ఆరాధిస్తున్నా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకుంటే, జీవితంలో దుఃఖించరు.

ఈ ప్రశ్న లోతు అర్ధం అయితే మీరు  జీవితంలో దుఖించరు! దుఖం మీ దరిదాపుల్లోకి రాదు! సమాధానం తెలిస్తే చెప్పండి!. కాని మీరు కూడా ఆలోచించండి!

పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం , అజ్ఞాత వాసాలు చేయడంలో అంతర్యం ఏంటి? ఈ ప్రశ్న ప్రతిఒక్కరు వేసుకోవలసినది..

1. పాండవులు మాయజూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవులపాలు అయ్యారని అందరికి తెలిసిందే. అరణ్యవాస చేస్తూ ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడు సత్యభామ సహితంగా పాండవులను కలుసుకోవడానికి వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడిని ధర్మరాజు "జూదం ఆడేటప్పుడు మమ్మల్ని ఎందుకు కాపాడలేదు" అని ప్రశ్నిస్తాడు. అందుకు సమాధానంగా కృష్ణుడు "నేను ఆ రోజు అక్కడలేను, సాల్వుడు అనే రాజుతో మాయ యుద్ధం చేస్తున్నాను(6 నెలల పాటు ఆ యుద్ధం జరిగింది!) నాకు కానీ ఆ విషయం తెలిసుంటే అలా జరగనిచ్చేవాడిని కాను" అన్నాడు. (ఆ సర్వంతర్యామికిజూదం సంగతి తెలియదంటారా)?.

అసలు ఈ పాండవులు , శ్రీకృష్ణుడు వచ్చిందే భూమి మీద దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం. కానీ పాండవులు మానవులు కావడం చేత శక్తులు కానీ, కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడానికి సరైన ఆయుధాలు కానీ, ఏమీలేవు. ఉన్నది ఒక్కటే 'ధర్మం'.. అరణ్యవాసం అజ్ఞాత వాసంలో వీళ్ళని నిలబెట్టింది ధర్మమే. కాని అలాగే కొనసాగితే ధర్మం పేరుతో బ్రష్టులు అయిపోతారు. ధర్మాన్ని అన్ని కోణాల్లో ప్రయోగించాలి. ఆలా చేయాలంటే బలం, బలగం, ఆయుధ సంపత్తి, అస్త్ర శాస్త్రాలు, దైవబలం మెండుగా ఉండాలి. కాని ఆడిన మాట కోసం అడవుల పాలైన పాండవులు రాబోయే కురుక్షేత్ర మహా సంగ్రామంలో గెలవడం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అసాధ్యం. అందుకే శ్రీకృష్ణుడు తన మాయని ప్రదర్శించాడు. తాత్కాలిక కృష్ణమాయ కల్పించాడు. వస్త్రాపహరణం సమయంలో ద్రౌపతిశ్రీకృష్ణ స్మరణ చేయగానే వచ్చి వస్త్రాలు ఇచ్చాడు. మరి అక్కడే ఉన్న ధర్మరాజు  అదంతా చూసికూడా శ్రీకృష్ణుడిని తలచుకోలేకపోయాడు!(ఇదే మాయ అంటే).

అటుపక్క భీష్ముడు లాంటి యోధుడు (21సార్లు క్షత్రియులు మీదకి దండెత్తి క్షత్రియ వంశాన్ని నిర్మూలం చేసిన దీరోధత్తుడు, పరశురాముడిని ఓడించిన మహావీరుడు), పరశురాముడి వద్ద శిష్యరికం చేసి కౌరవుల పాండవులకు శిక్షణ ఇచ్చిన వీరాధి వీరుడు ఎలాంటి అస్త్ర శాస్త్రాలనైనా అలవోకగా ఎదుర్కోగల ద్రోణుడు ఒకప్రక్క.  పుట్టుకతోనే కవచంతో పుట్టిన కర్ణుడు(ఈ కవచాన్ని బెదించాలంటే మానవమాత్రుడి వల్ల కాదు! దైవబలం పుష్కలంగా ఉండాలి). కపటి శకుని, పుత్రప్రేమతో తపించిపోయే దృతరాష్ట్రుడు, అన్నకోసం దేనికైనా తెగించే దుశ్శాసనుడు వీళ్ళు ఒక పక్క.

ఇంతటి వీరులైన వీరందరిని ఓడించాలి. వీరికి సామంతులు మహాబలవంతులు. వీరిని ఓడించి ధర్మాన్ని నిలబెట్టాలంటే వీళ్ళకి ఇప్పుడు ఉన్న శక్తి చాలదు. కనుక వీరిని పుటం పెట్టిన బంగారంలా, సానబెట్టిన వజ్రంలా తయారుచేసి శత్రువుల మీదకి సాధించాలి. అప్పుడే విజయం వరిస్తుంది. అందుకే మనకి పైకి శ్రీకృష్ణుడు తోడు ఉన్నా పాండవులు అడవుల పాలయ్యారు. కౌరవులు సుఖపడ్డారు అనుకునేలా కనబడుతుంది. లోక రక్షణ కోసం తాత్కాలిక కష్టాలు అనుభవించినా భవిష్యత్తు బావుంటుంది కనుక దుష్టశిక్షణ జరుగుతుంది కనుక పాండవులు అడవులలో తిరుగాడవలసి వచ్చింది.

2. జూదంలో ఒడి అడవులపాలు అయ్యారు.  అసలు ఇక్కడ జరిగింది వేరు. వీళ్ళని అడవులకి పంపించాము ఇక తిరుగులేదు అని దుష్టచతుష్టయం అనుకుంది. భోగాల్లో మునిగి తేలారు. ఆయుధ సంపత్తి పెంచుకోవడం కానీ, అస్త్రశస్త్రాలు సాధిచడం కానీ ఏమి చేయకపోగా ఋషులు వచ్చినప్పుడు దుర్యోధనుడు అహంకారంతో అగౌరవపరచి శాపాలు పెంచుకున్నాడు. అడవుల్లో పాండవులని శ్రీకృష్ణుడు ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. పాండవుల క్షేమం కోసం  ఎప్పటికప్పుడు మునులని, ఋషులని, ఎవరిని చూస్తే జన్మ చరితార్ధం అవుతుందో అలాంటి మార్కండేయ మహర్షిని పంపించి జ్ఞానాన్ని ప్రసాదించి, ఎన్నో శక్తులని అందిపుచ్చుకునేల చేశాడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడి ప్రేరేపణతో శివుడి కోసం తపస్సు చేస్తున్న అర్జునుడికి సాక్షాత్తు శివుడే కిరాత రూపంలో వచ్చి అర్జునుడితో తలపడ్డాడు.

అర్జునుడు వేస్తున్న బాణాలు వేసినట్లు వేసినట్లు మాయమవుతున్నాయి. చివరికి అమ్ములపొద కూడా మాయమయింది. అయినా కూడా వచ్చింది ఎవరో గ్రహించకుండా విల్లుతో మీదికి దూకాడు. విల్లు మాయమయింది.. శివుడు నవ్వుకొని ఒక్క పిడికిటి పోటు పొడవడంతో మూర్చిల్లి కిందపడ్డాడు. తెప్పరిల్లిన తరువాత చూస్తే ఇంకేముంది! కిరాతుల రూపంలో ఉన్న శివపార్వతులు అసలు రూపంలో దర్శనం ఇచ్చారు. పాశుపతాస్త్రం అందించారు. ఆవిధంగా అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించాడు. శివా! ఎందుకు నన్ను ఇలా ఆట పట్టించావ్? అని అడిగితె! పూజలు, మంత్రాలు ప్రతినిత్యం వింటూనే ఉన్నాను.  ఈ బడితెపూజ అయితే కొత్తగా ఉంటుందని అని సమాదానం ఇచ్చాడు శివుడు. అర్జునుడు శివుడుని తాకి కలబడటం వల్ల శరీరం వజ్రకవచంలా తయారయ్యింది(ఇదొక వరం). దానికితోడు పాశుపతాస్త్రం వచ్చింది.

తదనంతరం ఇంద్రుడు వచ్చి స్వర్గలోకానికి తీసుకెళతాడు. అక్కడ అనుకోని సంఘటన వలన ఊర్వశి చేత స్వర్గలోకంలో పేడి (నపుంసకుడు) అవుతావు అని శాపం పొందుతాడు. ఇది అంతా గమనించిన ఇంద్రుడు అర్జునుడి సత్యనిష్ఠ కి సంతసించి ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇంద్రుడు వరంగా తిప్పాడు. దీనికి తోడు ఇంద్రుడు అర్జునుడికి నాట్యం శిక్షణ ఇస్తాడు. ఈశాపం అజ్ఞాత వాసంలో వరంగా మారింది. నృత్యం వలన విరాట కొలువులో విరాటుడి కుమార్తె ఉత్తరకి నాట్యశిక్షణ కోసం ఉపయోగపడింది. ధర్మరాజు జ్ఞానాన్ని, తప్పస్సుని పెంచుకుంటే, అర్జునుడు ఆయుధ సంపత్తిని పెంచుకున్నాడు. భీముడు గురించి చెప్పెపనిలేదు. భీముడు హిమగిరులలో విహరిస్తుండగా పుష్పం కోసం బయలుదేరి ఇలా అరణ్య అజ్ఞాత వాసాలు ముగించి ఆయుధ సంపత్తిని, ఎనలేని కీర్తి గడించారు.

ఇప్పడు అసలు విషయంలోకి వద్దాం!
    ప్రతి మనిషి జీవితంలో గడ్డుకాలం ఉంటుంది. ఏపని చేసినా కలిసిరావడంలేదు అని వాపోతారు. దేవుడుని నిందిస్తారు. నేను ఎం పాపం చేశాను! ఎందుకు నాకు ఈ శిక్ష అని లోకంలో కష్టాలన్నీ వీళ్ళకే వచ్చినట్లు బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో మునుపు పనికిమాలిన పనులు గుర్తుండవు. గుర్తురావు. పైగా కష్టాలలో ఉండడం చేత ఎక్కడ సాయం అడుగుతారో అని పలకరించడానికి కూడా ఎవరు రారు. అప్పుడు మనం చేసే ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు ఎవరులేరు. నాబ్రతుకు ఇంతే! ఇంకేమి సాధించలేను మరణమే శరణ్యం అనే ఆలోచనల్లోకి వెళ్ళిపోతారు. ఇది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది.

దీన్నే మనం అరణ్యవాసం అనుకోవాలి. ఆ సమయంలో ఎవరులేరని భాధపడకూడదు. ఎందుకంటే ఎవరు లేకపోతేనే తపస్సు చేయడానికి మంచి అవకాశం. ఎందుకంటే ఇంతకుముందు అన్ని ఉన్నాయి. అందరూ ఉన్నారు. అప్పుడు ఈ ఆలోచన రాలేదు. ఇప్పుడు కష్టంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరూ రారు. రారు అని నింద వేసి ఏడుస్తూ కూర్చుంటే ఇంకా మీరు సాధించేది ఏమిటి? ఒకవేళ వస్తే సాధన చేస్తారా? చేయరు.  (ఒకటి ఆలోచించండి! పాండవులు అరణ్యవసం చేయకపోతే కురుక్షేత్రం జరిగెదికాదు. ఎల్లప్పుడూ రాజ్యం కోసం ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ, యజ్ఞాలు యాగాలు అంటూ వీటితోనే కాలం గడిచేది. దుష్టశిక్షణ జరిగేది కాదు. మహాభారతం మనకి దొరికేది కాదు.. వాళ్ళుకూడా చరిత్రలో కలిసిపొయెవారె!).. అలాగే మనం కూడా కష్టం అనే గడ్డు కాలాన్ని గ్రంధ పఠనం అనే తపస్సు చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలి. అలాగే ఏదైనా విద్యలని అభ్యసించాలి. సరైన గురువు కోసం అన్వేషించాలి! అప్పుడు తెలుస్తుంది జీవితం ఎలా సరిదిద్దుకోవాలో. కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో!

ఒకరకంగా చెప్పాలంటే సుఖపడుతున్నాం అంటే పుణ్యం కరిగిపోతున్నట్టు. కష్టపడుతున్నాం అంటే పాపం కరిగిపోతున్నట్టు. ఇప్పడు ఆలోచించుకోండి! సుఖాలలో ఉన్నప్పుడు కూడా కష్టపడుతూ పుణ్యాన్ని డిపాజిట్ చేసుకుంటారా! కష్టాలలో కూడా సుఖాల కోసం వెంపర్లాడుతూ కష్టాలు కొనితెచ్చుకుంటారా! సుఖపడుతున్నప్పుడు దానధర్మాలు చేయాలి. యజ్ఞయాగాదులు (రోజుకు ఒక పేజి అయినా గ్రంధ పటనం చేస్తుంటే అదే కలియుగంలో  యజ్ఞం) చేయాలి. అప్పుడు కష్టాలు మీదగ్గరికి రావు సరికదా. మీకు ప్రమాదం కలిగించాలి అనుకున్నవారు మీ చుట్టూ ఉన్నా అనతికాలంలోనే వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక మార్గం వైపు మీరు ఒక అడుగు వేశారు కనుక ఆదైవం ఎప్పుడు మీ పక్కనే ఉంటాడు. భగవంతుడు మీప్రక్కనే ఉన్నట్లు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు కష్టం వచ్చిందంటే దానికి ఎదో కారణం ఉంటుంది. శ్రీకృష్ణుడు తోడు ఉండికూడా పాండవులు అరణ్యవాసం చేసినట్లు.. కనుక ఎప్పుడూ దేనికి బెదిరిపోవద్దు. కృంగిపోవద్దు.