Monday, July 15, 2019

Lord Puri Jagannatha Story Part 2

శ్రీ జగన్నాథ లీలలు 

శ్రీ జగన్నాథుడు ఈ  జగత్తులో  ఆవిర్బవించడానికి  మూల కారణం  అతని  ప్రియా  భక్తుడైయినా  ఇంద్రమన్యడు   మహారాజు.  ఆ రాజుకు ఉన్నట్టి  ఏకైక లక్ష్యం  భగవంతుడిని  ముఖా ముఖి చూడడం!.  ఆ  లక్ష్యం   తప్ప అతనికి జీవితంలో మరొక  కార్యమే  కానీపించలేదు.   ఇంద్రమన్యడు  ఎప్పుడూ  ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచింస్తుండేవాడు. 

"ఆహా ! భగవంతుడి  అనుగ్రహం  వలన   నేను  అన్ని  దిక్కులను  జయి0చాను.  నాకు  అపారమైన  సంపదలు లభించాయి.  రాజులందరు ఎంతో శ్రద్ధతో  నాకు  సాయంగా కొనసాగుతున్నారు.  మనషి కోరుకునే సమస్తం  నాకు  ఉన్నప్పటికీనీ  ఇంకా  ఎదో  వెలితి  నన్ను పట్టి  పీడిస్తో0ది.  అసలు నా మనసు  ఎందుకు  చింతాక్రాంతమై  ఉందొ నా  రాణి,  మంత్రులు, అందరికి  అర్థం  చేసుకోలేకపోతున్నారు.  ఈ  జగత్తులోని  వ్యవహారాలలో  ఉన్న  సూన్యత్వం  అర్థం  చేసుకోలేకపోతే  నాలో  ఉన్న  తీవ్రమైన  తాపన  వాళ్లకు  ఎల్లా  అర్థం అవుతుంది?  పరమ పురుషుడైన  దేవ దేవుడిని  చూడాలనేదే  నా  ఏకైక  కోరిక,  ఏకైక  ఆశయం.  ఆహా !  నా  కళ్ళతో  నేను  స్వయంగా  ఆ  దేవ దేవుని  ముఖా ముఖి  చూడగలగాలి.  నాకు  రాజ్యం  వద్దు,  స్వర్గం  వద్దు !  అందరు నన్ను చూసి  పిచ్చివాడిని అనుకున్నా  పరవాలేదు.  ఏఈ రోజు  నేను  ఒక్క  ప్రతిజ్ఞ  చేస్తున్నాను.  నా మనసు,  వాక్కులు, ఆలోచనలు,  కార్యాలు  అన్ని  కూడ  పరతత్వమైన   భగంతుని  చూసిందేకే  నేను  వినియోగిస్తాను. "  

ఇంద్రమన్యడుని  గురించి  అతని  సేవాని  యుద్ధవీరుడు,  పురోహితుడు  విద్యాపతి  చేర్చుకుంటూ  రాజులో  కలిగిన  మార్పు  గురుంచి కలతచెందారు.  రాణి  కూడ  రాజు గారి వ్యవహారం  పట్ల  కలత  చెందుతుందని  వారు   అనుకున్నారు. 

"రాజు గారు గురుంచి కొన్ని పుకార్లు  గాలిలో  తేరుగుతున్నాయి.  వాటి  గురించి  నీతో  మాట్లాడుదామని  అనుకుంటున్నాను "  అని  విద్యాపతి  అన్నాడు. 
"అయ్యా!  నీవు  ప్రధాన  పురోహితువి.   ఆ  విషయ0  నీకే  తెలియక  పోతే  ఇంకా ఎవరికీ  తెలుస్తుంది."  అని యుద్ధవీరుడు  నవ్వుతూ  అన్నాడు.. 

"మనిషి కళ్ళు మూసుకొని,  నోరు  మూసుకొని  కూర్చొని  ధాన్యం  చేస్తుంటే  అతని మనసులో  మాట  దేవుడికి  తప్ప  ఇంకా  ఎవరికీ  తెలుస్తుంది"  అని  విద్యాపతి అన్నాడు. 

"బహుశా  రాణికి  తెలుస్తుందేమో"  అని  సేనాని  అనగానే  విద్యాపతికి  వెంటనే ఒక్క  పద్యం  గుర్తుకు వచింది. 
"వెలిగే   సూర్యనికి  తెలియని  దేముంటుంది?
బుషులకు  వెల్లడి గని  సత్యము  ఏముంటుంది?
ఆకాశానికి  వినపడిని  శబ్దం  ఏముంటుంది?
భార్య  చెంత  దాచే  రహస్యం  ఏముంటుంది?" అని   విద్యాపతి  చెలాకీగా  అన్నాడు. 
ఆ  పద్య0  విద్యాపతి  చేపకగానే  ఇద్దరు  కాసేపు  కాసేపు  హాయిగా  నవ్వుకున్నారు.  తాను  ఒక్కసారి  ఇంద్రమన్యడు  మహారాజు  దగ్గరకు  వెళ్లి  అసలు  విషయం ఏంటో  జాగ్రత్తగా  గమనించి  వస్తానని  విద్యాపతి  అప్పుడు  చెప్పి  నేరుగా  ఉద్యానవనానికి  వెళ్ళాడు.  అక్కడ  రాజు  ఒంటరిగా  కూర్చొని   ఏవో  తనలో  తానే  మాట్లాడుకోవడం  విద్యాపతికి  కనిపించింది.  రాణి  అనుకుందాంతా  సత్యమేనని  అతనికి  అర్థమై0ది.  నిజానికి  రాణి  ఉహించనదాని  కంటే  సమస్య  ఇంకా  గంబిరంగా  ఉందేమోనని  విద్యాపతికి  అనిపించింది.  ఆ  విధంగా  ఆలోచిస్తూ  అతడు  నెమ్మదిగా  రాజు ముందుకు  వచ్చాడు.  అతనిని  చూడగానే   ఇంద్రమన్యడునికి  అన0డం  కలిగింది.  ప్రేమతో  ఆ  రాజు  అతనిని  ఆలింగనం  చేసుకున్నాడు. 

"విద్యాపతి! ఎక్కడ  నుండి  వస్తున్నావు? " అని  రాజు  కుతూహలంగా  అడిగాడు.

"నేను  ఇప్పుడు గుడికి  వెళుతూ  దారిలో  మిమ్మల్ని  చూసి  ఆగాను"  అని విద్యాపతి అన్నాడు. 

"ఆహా!  మీ  వంటి బ్రాహ్మణులు  ఎంతో  బాగ్యవ0తులు.  ఎప్పుడు  మీరు  భగత్ సేవలోనే  ఉంటారు.  మీ ఇంట్లో  నిత్యాగ్నిహోత్రం  చక్కగా  సాగుతుందా?"  అని రాజు  అడిగాడు.  "రాజు!  మీ  అద్భుతమైన  పాలనలో  సురక్షతంగా  ఉన్న  మాకు  ధర్మపాలనలో  లోటు వస్తుందా?  మేమంతా  ప్రశాంతగా ఉన్నాము.  అయినా  ఒక  మాట  మిమ్మల్ని  అడగాలి.  మీ  గురించిన చింత కొందరిలో  బాగా  పెరుగుపోయింది."  అని  విద్యాపతి  నెమ్మదిగా  అన్నాడు. 

"నా  గురించా?  ఏంటి  కారణం?"  రాజు  కాస్త  తీవ్రంగా  ప్రశ్నించాడు. 

"ఈ  మధ్య  మీరు  కాస్త  పరధ్యానంగా  ఉంటున్నారని,  అది  అసాధారణంగా  ఉందని  మీ స్నేహితులు  అనుకుంటున్నారు" అని విద్యపతి  అన్నాడు. 

"ఆ విషయాన్ని నేను కందునను. ఈ మధ్య నాలో చాలా పెద్ద మూర్పు వచ్చింది. భగవన్మందిరంలో  దేవదేవుని గురించే పదేపదే ఐనధంతో  నాలో శ్రద్ధ  రగులోకొంది .  అదే  నేన్ను త్రివరంగా  దహిస్తుంది."  అని ఇంద్రమున్నాడు అన్నాడు.
"కానీ  దాని  ఉదేశ్యం  మీరు  మీ కర్తవ్యాన్ని  వదిలి పెటాలిని  కాదు కదా? "  అని విద్యాపతి  సూటిగా  ప్రశ్మించాడు.

"ఆ  మాట  ఎవ్వరు అన్నారు?  ఈ  మధ్యకాలంలో  నేను  సభకు  వెళ్లి చాలా  రోజులు  అయి  ఉండవచ్చు.  కానీ  నా "భాద్యతలను  నేను  ఏనాడూ  విస్మరించలేదు.  నా  కర్తవ్యాలను  నేను  నిర్వహించే  తీరుతాను.  కానీ కేవలం  ఆదే  నాకు  సంతృప్తిని  ఇవ్వదు.  గురువర్యుడైయన  భగవంతుండిని  నేను  కళ్లారా  చూడనతవరకు,  ఆ  దేవదేవున్ని  పాదపాద్మలను  నా  చేతులతో  పట్టుకోనంతవరకు  నా  రెప్పలు  ఆరవు .  నా  హృదయం  చల్లారదు"  అని  రాజు  ఉద్వేగంతో  అన్నాడు. 

"రాజా!  నీ  మాటలు  మరీ  విడ్డూరంగా  ఉన్నాయి.  విష్ణువు  మూలోకాలకు  ఆవల  ఉంటాడు.  ఆ   దేవదేవున్ని  దర్శనం  కలుగుతుంది  అని  ఉహించుకున్నావు?  మహాశక్తీవంతులైన  యోగులే  తమ  తీవ్రమైన  ధ్యానంతోనైనా అతని క్షణకాలం దర్శనం  పొందలేకపోతున్నారు.  అది  నీకు  తెలియదా? "  అని  విద్యాపతి  పంతమాడే  ధోరణిలో  చెప్పసాగాడు.    
"అదంతా  నాకు  తెలియదు.  కానీ  నా   నిశ్చయం  మాత్రం  ఒక్కటే.  అందుకే  ఇవాళ  నేను  సభకు  వెళ్లి  అందరికి  ఒక్క  విషయం అడగాలని  అనుకుంటున్నాను.  భగవంతుండిని    ముఖా మూఖీ  ఎల్లా   చూడవచ్చో  ఎవరైనా  నాకు  చెబుతారేమో?"  అని  రాజు  ఆశగా  అన్నాడు. 

ఈ  విదంగా  కాసేపు  మాట్లాడుకొని  రాజు,  విద్యాపతి  నేరుగా  సభా గృహానికి   వెళ్లారు.  రాజు  సభలో  ప్రవేశస్తున్నాడని  తెలుసుకోగానే  అందరు  లేచి నిలపడ్డారు.  వందిమాగధులు  రాజునూ  కీర్తిస్తూ  సోత్రాలు  చేసారు.  రాజు  నడిచే  దారిలో  సేవకులు  పూలు  చల్లారు,   
పరిచారకులు  నీవేనలు  విసిరారు.  "సభికులారా,   మంత్రులారా,  నందిమదిగులారా!  మీ   అందరికి   నా  కృత జ్ఞతలు. ఈ  రోజు  నా  హృదయంలోని  మాటలను  మీకు  చెబుదామనే  నేను  సభలో  ప్రవేశంచాను.  ఎవరైనా  నా  ప్రశ్నకు  సమాధానం  చెప్పగలతే  నేను  అతనికి  సర్వదా  బుణపడి  ఉంటాను"  అని  ఇంద్రమన్యడు  వినయంతో  పలికాడు . 

"రాజా!  మీ  మనస్సులోని   మాట  చెప్పండి.  మిమ్మల్ని  సేవచిండానికి  మేము  సిద్ధంగా ఉన్నాము."  అని  సభికులందరు  ముక్తకంఠంతో  పలికారు. 

"భగవంతుని    దయ  వలన  నాకు  నాకు  ఇప్పడు  దేనికి  లోటు  లేదు. రాజ్యము,  సంతోషం, సంపదలు,  శక్తీ, బలము,  గౌరవము  అన్ని  నాకు  అపారంగా  ఉన్నాయి.  అయినా  నేను  దరిద్రుడుననే,  ఏమి  లేని  బిచ్చగాడిననే  నాకు  అనిపిస్తుంది."  అని  ఇంద్రమాన్యడు  గంబిరంగా పలికాడు.  అందరు  ఆశ్చర్య పోయారు.  వారికీ  నోటమాట  రాలేదు ... 

Friday, July 5, 2019

kaaki ammakka kadha

చందమామ కథలు


కాకమ్మక్క కధ 

Kaaki-ammakka-Kadha-1.jpeg

కాకులు  పురాణకాలం  నుండి  చాలా  ప్రసిద్ధి  చెందినవి.  ఒక్కసారి  ఎప్పుడో  ఒక్క కాకి  అగస్త్యు  మహామూని  ఒక్క   కమ0డలం   పడివేసి  వెళ్ళింది.  అప్పుడు   అందులో  ఉన్న  గంగ బయటకు   వచ్చి   నదిగా   ప్రవహించింది. శ్రీ  రామచంద్రుడు   సీతతో   అరణ్యంలో   ఉన్నపుడు  ఒక్కనాడు  ఒక్క  కాకివచ్చి  సీతమ్మ తల్లి  యొక్క  రొమ్ముమీద   పొడిచింది.  అప్పుడు శ్రీ  రాముడుకి  కాకి  మీద  మహాకోపం  వచ్చింది.    డాగరలోఉన్న  గడ్డపరక  ఎత్తి  కాకి మీద  విసిరాడు.   అపుడూ   కాకి  బయపడి  మూడులోకాలూ   తిరిగింది.  రక్షించేవారు  లేక   ఆఖరుకు  శ్రీ  రామచంద్రుడుని  శరణు వీడింది.   కాకికి  ప్రాణం  దక్కింది  కానీ  ఒక్క  కన్ను పోయింది.  ఆనాటినుండి  కాకులకు  ఒంటికంటి  చూపే.  కాకి  ఎట్లా  చూస్తుందో  మీకు  ఎవరికీ  తెలియదు కదా.  

కాకులలో  ఉన్న  కొన్ని  మంచి   లక్ష్మణాలు  మనషులులో  కూడా  లేవు.   వాటిలో  వర్ణభేదం లేదు.  అందుకనే  'తెల్లనికాకులు లేవు  తెలియర  సుమతీ'  అన్నాడు కవి. కొన్ని కాకులకు  మనం  మాలాకాకులంటాం,  కానీ  నిజంగా   వాటిలో  అంటరానితనం  లేదు.  కాకులు  ఇళ్ల  కప్పులమీద  వరసగా  కూర్చుని  చదుకోవడం  చూసారా?   దాన్నే   కాకి  బడి  అంటారు.  కాకులో  ఇంకో  మంచి  బుద్ధి కూడా ఉంది.  ఒక్క కాకికి  తేనేటందుకు   ఏమయినా   దొరికితే  అన్ని  కాకులను  పిలిస్తుంది.   అంతేకాని   తన పొట్టకు మాత్రమే చూసుకోడు.  వీటిని  బట్టి  కాకులు  చాలా  గొప్పవని  చెప్పవచ్చు.


అటువంటి  ప్రసిద్ధి గన్న  కాకి  వశంలో  పుట్టింది మన  కాకమ్మక్కా.  ఆవిడ  గొప్ప  సంగీత  విద్వంసురాలు.  ఆవిడ   గోతెత్తి  కాకద్వానీ, కాకభైరవీ  మొదలైన  రాగాలు  పడితే   దిక్కులు  అన్ని  మారుమ్రోగుతాయి.  వినే వాళ్ళు  చెవులు చిల్లులు పడుతాయి. 

కాకమ్మక్కాయ్య   మోగుడు  కాకిబావ, చాలా  విద్యలు   నేర్చినవాడు.  పిల్లల  నెత్తి  కొట్టి  చేతిలో ఉన్న  అప్పచ్చులు   కాజేయడంలో  మంచి  మేధావి.   ఎన్ని గొప్ప  గుణాలు  ఉన్న  కాకమ్మక్కాయ్య    కాకి   బావను   వరించింది. 

ఒక్కనాడు  ప్రొద్దున్నే    కాకిబావయ్య   కాకమ్మక్కాయ్యతో  ఇల్లా   అన్నాడు. "ఒసే ,  కాకామణి !  మనం  ఈ  ఫుట   ఎక్క డికైనా   మంచిచోటికి  విందుకుపోతే  ఎట్లా  ఉంటుందే?"   అని  అన్నాడు.  కాకి  బావ  సంతోషంతో  ఉన్నపుడు  కాకిఅక్కయ్యను   కాకామణి  అని  పిలుస్తాడు. 

"అప్పుడు  కాకమణి   సరే  బాగుటుంది అని అంది.  మరి  ఎవరి ఇ0టికి   పోదాం" అని  రాగం  తీసింది  కాకమ్మ.  కాకమ్మ  అక్క  ఎపుడు  మాములుగా చెప్పాదు   రాగంతిసి  చెప్పుతుంది.   

"దగ్గర  లో    నాయడుగారి  ఇళ్ళు  ఉంది.   ప్రొద్దుటె   పూట  చక్కని   ఇడ్డే నలూ, ఉప్త్మ  చేసుకుంటారు.  అయితే   నాయుడు  గారు  కుంభకర్ణుడు .  బారెడు   పూదెక్కే  వరకు  లేవడు.  ఎం  మనయూషులో  వీళ్ళు   మన లాగా   వీళ్లకు   తెల్లవారుజామున  లేచే  ఆల్లవాటులేదు.  ఒట్టి   సోమరిపోతూలు .   మనమిద్దరం  నాయాడు  గారి  ఇంటికి   పోదాం.  నీవు  కమ్మగా   అయినాను   మేలు  కొలుపులు  పాడు.   అప్పుడుయన    లేచి   మనకు  ఫలహారం   పెట్టిస్తారు." అని  అన్నాడు  కాకిబావ. 

నాయడుగారి  ఇంటి  పక్కన   ఒక్క  వేప  చెట్టు  ఉంది.   దానికొమ్మ   ఒక్కటి   మెడ  మీదకి  ఉంది.  ఆ కొమ్మమీద  కాకి  దంపతులు  కూర్చున్నారు.   ఇద్దరు  గో0తులు   కలిసి  ముచ్చటగా   నాయడుగారికి  మేలు  కొలుపు  పాట  ప్రారంభించారు.   
"కా కా !   కా కా క్రా !  ఆక్రా !  కిర్  క్రీ  !  క్రా క్రా!"
" క్రా  అ  అ  అ! కా  అ అ అ !  క్రా  అ అ అ ! క్రు   క్రిర్ !"
 కాకి  పాటకి  అంతటివాడైనా   నిద్రలేవచ్చిందే. కాకి  పాట    ఋషులు   తపస్సు   కూడా  భగ్నం  చేయగలదు.   కానీ   నాయుడు  గారు  యద్దుమొద్దు  స్వరూపం.  అందుచేత   అయినా   కాకి  దంపతులు  పాట  వినకుండా  నిద్రపోతున్నాడు. 
                                 Kaaki-ammakka-Kadha-2.jpeg అందుచేత  మన   కాకి  దంపతులు  స్థాయి  హెచ్చించి  రాగం  మర్చి  ఇంకో  మంచిపాట  పారంభించారు.  కాకబైరవి  అలాపాసన  జోరుగా  సాగింది.   అంతకంతకు  ఇంకా  జోరు  పెంచారు.  ఎల్లాగయితే  నేమి   నాయుడు  లేచారు.   కానీ  కాకి పాటకు  ఆనంది0చడానికి బదులు   తన  చేతి  కర్ర   కాకులు మీదకి  కోపంతో  విసిరి  వేశాడు.   అది  కాస్తా   వేప  కొమ్మల  మధ్య   చెక్కుకు  పోయింది.  చేసేది  ఏమిలేక,   నాయుడుగారు  తన  నౌకరును    పలరిహారం    పట్టుకురమ్మని  చెప్పి  అతను  మొహం   కడుకోవడానికి   వేళ్లాడు.     

నౌకరు   నాయుడుగారి   ఫలహారం   పట్టుకొచ్చి   గదిలో  పెట్టి   వెళ్ళాడు.  ఆరు   ఇడ్డేనాలు,  కమ్మని   నెయ్యి ,  గారెలు,  బిస్కెట్లు,  వెన్నా,   అన్నీ   పళ్లెంలో  ఉన్నాయి. 
                 Kaaki-ammakka-Kadha-3.jpeg కాకి  బావ  మరియు  కాకమ్మక్కాయ్య  చెట్టు  మీద  నుండి  వచ్చి  ఫలహారం  ప్రారంభించారు. కాకమ్మక్కాయ్య  ఒక్క   ఇడ్డేను,  ఒక్క  గరే  తినింది,  కాకి  బావ  మాత్రం   దీటు0గా    తిన్నాడు.   అయితే  ఇద్దరు  వెన్న  నజ్జుకున్నారు.  ఇద్దరి  ముక్కులుకు  వెన్న  ఆంటుకుంది.  ఇద్దరు  కలిసి  మంచి  నీళ్లు  తాగారు. కాకిబావ  నాయుడుగారి  తివాసీమీద    మూక్కు  తుడుచుకున్నాడు.  కాకమ్మక్కయ్య   పక్క  గుడ్డలతో  తుడుచుకుంది. 
Kaaki-ammakka-Kadha-4.jpeg

ముక్కు  తుడుచుకుంటూ   ఉండగా  కాకిబావకు   మంచి  ఆలోచన  వచ్చింది.   పలహారం  పళ్లే  మంతా   తాను  పట్టులేకపోతే  ఎంత  బాగుంటుంది. అని  ఆలోచన  బాగానే   ఉంది  కాని  పట్టుకుపోవడం  ఎట్లా?    పలహారం   పళ్లెం  ముక్కుకు  ఆరపదు.   అందుకని కాకిబావ  పలహారం  పాళెం   కిందఉన్న   గుడ్డను  ముక్కుకు  పట్టుకొని   లాగాడు.  బల్లమీద  ఉన్నా  అన్ని  వస్తువులు  అన్ని  మొత్తం  కిందకి   పడిపోయాయి . 

ఇంకా గాప్  చెప్  అక్కడ   ఎం  జరిగిందో  చూడకుండా   కాకి బావ  కాకమ్మక్కా  ఇద్దరూ అక్కడ నుండి   ఊరులో  వాలిపోయారు. 

Keelu Gurram part 2

 కీలు గుర్రం 2


ఫిరోజిషా  మేట్లు  దిగి  ఏడో  అంతస్తుకు  వెళ్ళాడు  అతనికి  అక్కడ  సంగీతం  వినపడింది.  ఆ   శబ్దానికి  అక్కడికి  వెళ్ళాడు  మరకత   మాణిక్యాలుతో   దగ దగ  మెరుస్తుంది.  ఒక్క  పెద్ద  గది  లోపలకు  వెళ్ళడు.   అక్కడ  ఒక్క  హంసతాలుకా  తల్పంమీద   ఒక్క  రాజకుమార్తె  పడుకోనివుంది  ఆమె  చుట్టూ  చెలికెతులు  పడుకొని  నిద్రపోతున్నారు.  ఫిరోజిషా  తన  కళ్ళు  తాను  నమ్మలేక  పోతున్నాడు.  కలగంటున్నాను అని అనుకున్నాడు .  తన  వళ్ళు   తానే   గిచ్చుకున్నాడు  బాధ  తెలుస్తుంది  అని  అపుడు అంత  నిజం  అనుకున్నాడు.  

మళ్ళి   ఒక్కసారి   రాజకుమార్తె  వైపు  చూసాడు.  చుక్కల  మధ్య  చెంద్రుడులా  ఉంది.  బంగారపుజూటు  లాగా తళా  తళా  మెరుస్తోంది.  రాజపుత్రిక  కళ్ళు  తెరిచి  అతని  చూసింది.   

ఫిరోజిషా  ఆమె  పక్కకు  తీసుకెళ్లి  మొత్తం కదంతా  చెప్పాడు.  తనతో  పర్షియాకువచ్చి  నన్ను  పెళ్ళాడుమని  ప్రార్థించాడు.  వంగపుత్రిక  కూడా  అతని ప్రేమిచ్చింది. ఇంకా  రెండో  వాడికి  చెప్పకుండా  అతనివెంట  అతనివెంట  బయలుదేరింది.  ఇద్దరు  కీలు  గుర్రం  ఎక్కి  పర్షియాలో   తమ  పట్టణంలో   అడుగుపెట్టింది. 

మేళా తాళాలు,  బాజాభజింత్రిలు  లేకుండా  కొత్త   పెళ్లి  కూతురును  అంత:  పురాణకి  ఎల్లా  తీసుకోపోవడానికి  ఫిరోకిషాకు  మనసు  రావడం  లేదు.   రాజా  పుత్రికకు  ఇప్పుడే  వస్తానుఅని  చెప్పి  రాణి  గుర్రాన్ని  అక్కడే  తోటలోని   బంగలోని   దింపి  ఒక్కడే  ఇంటికి   వచ్చాడు.  

అప్పుడు  నవాబు  సంతోషానికి  అవధులు  లేక  పోయింది.  వెంటనే  శిల్పిని  విడుదల  చేయిచారు.  రాజపుత్రికని  తీసుకు  రావడానికి  పయత్నాలు  ప్రారంబమయ్యాయి.  ఈ  సంగతి అంత  శిల్పి  విన్నాడు. గుప్పుడు  చప్పుడు  లేకుండా  అక్కడకి  వెళ్లి,  "మేమ్ము  ఈ   గుర్రముమీద  అంత:  పురాణకి  తీసుకు  రమ్మని  చెప్పారు."  అని   నమ్మి  ఆమె  కీలు  గుర్రం  ఎక్కి  వెళ్ళిపోయింది. 

శిల్పి  ఎక్కినగుర్రం  పోయి  పోయి  గ్రీకు  దేశం  లో   ఒక  మైదానం  లో  దిగింది. రాజా కుమారి  శిల్పి  చేసిన  మోసం తెలుసుకొని  ఏడువ  సాగింది. ఆ  ఏడుపు  వేటకు  వచ్చిన  గ్రీకు  మహారాజుకు  వినపడింది.  అతడు  చప్పున  వచ్చి  జరిగిన  మోసం  చూసి  శిల్పి  తల  నరికి వేసాడు.  

గ్రీకురాజు  కూడా  వంగరాజు  పుత్రిక మీద ప్రేమ  పుట్టుంది. కానీ  అది  ఏ  మాత్రం  ఇష్టం  లేదు.  రాజు  బలాత్కర0 నుంచి  తప్పుకోటానికి  పిచ్చి  పట్టినట్టు  నటించింది.  దగరికి  వెళ్తే  రక్కేది,  పీకేది. రాజు  ఎంతో  బాధాపోయాడు.  ఆమె  పిచ్చి  నయం  చెయ్యడనికి  చాల  మంది  వైద్యులను  రపించాడు .  కానీ ఆమెకి  పిచ్చి  తగ్గలేదు.  నిజానికి  అసలు  పిచ్చి అయితే కదా ?.  

అక్కడ  అల్లా జరుగుతుండగా    అక్కడ  పర్షియాలో   కాలినడకను  బయలుదేరిన   ఫిరోజిషా   ఉర్లుదాటాడు. అల్లా  చేమలు  దురని  చిట్టి  అడివినీ,  కాకులు  దూరని  కారాడివి  దాటాడు.  ఎక్కడ   తన   రాజపుత్రిక  కనపడలేదు.  ఏరులు  దాటాడు,  నదులు  దాటాడు,  గట్టులు  అల్లాగే  మీట్టలు  ఎక్కాడు, చివరకు  గ్రీకు  దేశానికీ  చేరుకున్నాడు.  అక్కడ  రాజు  పుత్రిక   సంగతి  విన్నాడు. 

ఫిరోజిషా  వైద్యుడు  వేషంలో  రాజు  దగ్గరకి  వెళ్ళి  "నాకు  బూతావైద్యం  తెలుసు  అని  రాజపుత్రిక  పిచ్చి  కుదిరిస్తా  అని  చెప్పాడు."  రాజు  సంతోషించి  అతన్ని  అంత:పురానికి  తీసుకెళ్లాడు. కొత్త  వైద్యున్నీ  చూడగనే   రాజా  కుమారి  పిచ్చి   కొంచం  తగిపోయింది. 

"రాజా,  ఈ  అమ్మాయికి   ఒక్క  కీలు  గుర్రంమూలాన  ఈ  వ్యాధి  కలిగింది   ఈ   మెను   ఆ  గుర్రం  మీద  ఎక్కి0చి  చుట్టూ  గుగల  దీపం  వేయాలి , మంత్రాలు  చదవాలి .  అప్పడుగాని  ఈ వ్యాధి  పూర్తిగా  పోదు.  పదిఏళ్లు  ఇస్తే   కీలుగుర్రం  చేస్తాను. " అని  అన్నాడు  ఫిరోజిషా . 

"ఈ  భాగ్యానికి   పది  సంవత్సరాలు  ఎందుకు.  మన  డాగర ఒక్క  కీలుగుఱ్ఱం  ఉంది  దానితో  చికిత్స  చేయి".  అని  అన్నాడు  రాజు . 

ఫిరోజిషా  పాచిక  పారింది.  రాజు  కుమారిని   కీలుగుఱ్ఱం  ఎక్కిఇంచి  చుట్టూ   దట్టంగా  గుగ్గిలం   దీపం   వేయించాడు.  ఆ  పొగలో  తనుకూడా  కీలుగుర్రం   పై  ఎక్కాడు.  మీటు  నొక్కాడు  వాయు   వేగం  తో  కీలు  గుర్రం   అక్కశంలోకి  ఎగిరి  పోయింది. 

ఫిరోజిషా  బెంగాలు  రాకుమారితో  క్షేమంగా   ఇంటికి  చేరాడు .  వారి  ఇద్దరికి  వైభవంగా  పెళ్లి   జరిగింది.  పెళ్ళినాటి   రాత్రి  బెంగాలిరాకుమారి   కీలుగుర్రన్నీ  తగలపెట్టించింది.  దానితో   వాళ్ళ  కష్టాలు  తీరిపోయాయి.  హాయిగా  రాజ్యం   ఏలు  కుంటూ  నురుఏళ్లు  బ్రతికారు .