Monday, June 24, 2019

pandutakula pata

 చందమామ కథలు 

పండుటాకుల పాట 

నగా   అనగా  ఒక  పెద్ద  రావిచెట్టు. ఆ  చెట్టు  కొక  పెద్దకొమ్మ. ఆ  కొమ్మకొక  చిన్న  రెమ్మ.  ఆ  రెమ్మ  కొక  చిన్న  చిగురుటాకు. చిగురుటాకును  గాలి  చల్లగా  జోకొట్టింది.  సూర్యకిరణాలు  వెచ్చగా  మేలుకొలిపాయి.  ఆనందంతో  ఉబ్బిపోయింది, చిగురుటాకు. 

ఇంతలో  ఒకపాట  సన్నగా  వినిపించింది.  ఈ  పాట  చుట్టుపట్ల  చెట్లమీదినుంచి  సన్న  సన్నగా  వచ్చింది. ఈ  పాట  చుట్టుపట్ల  విన్నాయి.  అవికూడా  పాట  అందుకున్నాయి.  రావిచెట్టుమీది  పండుటాకులన్నీ        పాడసాగాయి.  
చిగురుటాకు  ఈ  పాట   విన్నది.  ఈ  పాట  ఏమిటో  దానికి  అర్ధం  కాలేదు.  " పండుటాకులు  రాలే  వేళయింది"  అని  చెప్పింది  పక్క  ఆకు. 

రాలి  కిందపడటంలో  ఆనందం  ఉంది  ఉండాలి  అనుకున్నది  చిగురుటాకు.  రాలి  కిందపడే  భాగ్యం  తనకు  లేదే  అని  విచారించింది  చిగురుటాకు. 

చిగురుటాకు  తన  విచారాన్ని  రెమ్మకు  చెప్పింది.  రెమ్మ  మందకు  చెప్పింది.  మంద  కొమ్మకు   చెప్పింది.  కొమ్మ  బోదెకు  చెప్పింది.  బోదె  తల్లి చెట్టుకు  చెప్పింది. 
తల్లిచెట్టు  బోదెతో  చిగురుటాకుకు  ఈ  విద్ధంగా  కబురుచేసింది: 
" చిగురుటాకును  విచారించవద్దను.  నన్నే  అంటి పెట్టుకుని  ఉండమను.  నేనిచ్చే  ఆహారం  ఆరగించమను.  ఎండలో  చలి  కాచుకోమను. గాలిలో  ఆడుకోమను,  పండుటాకుల   పాటపడే  సమయం  దానంతట  అదే   వస్తుంది.  అప్పటిదాకా  అగమను."   
ఈ  మాట  బోదె  కొమ్మకు  చెప్పింది.  కొమ్మ  మండకు  చెప్పింది. మండ  రెమ్మకు  చెప్పింది.  రెమ్మ  చిగురుటాకుకు  చెప్పింది. "అమ్మ  చెప్పినట్టే  చేస్తానులే," అన్నది  చిగురుటాకు. 
అది  తల్లినే  అంటిపెట్టుకున్నది.  ఎంతో  ఆహారం  తీసుకున్నది. ఎండలో  చలి  కాచుకున్నది.  గాలిలో  ఆదుకున్నది.  పెరిగి  పెద్డది  ముదురు  ఆకుపచ్చ  రంగుకు  తిరిగింది.  క్రమంగా  దానిరంగు  తేలిక  ఆకుపచ్చగా  మారింది.  తరువాత  పసుపు  పచ్చగా  అయింది.
  
మళ్లీ  పండుటాకులపాట  వినిపించింది. పండిన  ఈ  ఆకు కూడా  ఆ  పాట  విన్నది.  మిగిలిన  పండుటాకులతో  పాటు  పాడ  నారంభించింది.  పాట  తెచ్చిన  గాలి  మెల్లిగా  పండుటాకును  చెట్టునుంచి  వేరుచేసింది. 

పండుటాకు  మెల్లిగా  గాలిలో  తేలుతూ  క్రింద  పడిపోయింది. 
కింద  అనేకమైన  ఎండుటాకు  లున్నాయి.  వాటిమధ్య  పడి  పండుటాకుకుడా  వాటిలాగే  దీర్ఘనిద్ర  పోయింది.  

Thursday, June 13, 2019

Tenali Rama Lingadu Story

చందమామ కథలు 

తెనాలిరామలింగం 

తెనాలి రామలింగం అన్నే పేరు తెలియని పిల్లలు ఉండరు. అతనికి  పేరు ఎలా వచ్చిందనుకున్నారు? తెనాలి లో పుట్టాడు కాబట్టి తెనాలి రామలింగం అయ్యాడు.  ఆ రోజులో తెనాలి చాల చిన్న ఊరు . 


చిన్నప్పటినుంచి   రామలింగం   వట్టి  చిలిపి  వాడు  ప్రతి వాళ్ళను  పేరు పెట్టేవాడు అతనికి నదురు బెదరు అన్నేవి ఉడేవి కావు. తనికు నచ్చని దాన్ని వెక్కరించడం లో మొనగాడు .

ఒక్క  రోజున  రామ  లింగం  వీధిలో  ఆడుకుంటున్నాడు.  ఒక్క  యోగి  ఆ  దరిలో  పోతు  అతన్నీ  చూసాడు .  రామ  లింగం  రూపు  రేఖలోనూ  అతని  మాట  లోను  యోగికి  తెలివి తేటలు కనిపించాయి.  వెంటనే అయన రామ లింగాని దెగ్గరికి పిలిచి  శక్తి  మాత్రం  ఉపదేశించి  ఇల్లా  చెప్పాడు. 
Ramalingadu-and-saint.jpeg


"నాయనా !  ఈ మత్రం వెయ్యి  సార్లు  కాళికా  దేవి  గుడి  లో  జపిస్తే , దేవి  నీకు దర్శనం  అవుతుంది.  వెయ్యి  తలలుతో  కానీపిస్తుంది.  కానీ నీవు  భయపడకూడదు.  అప్పుడు  దేవి మెచ్చి  నివు  కోరు కోన్న  వరం ఇస్తుంది. "  అని చెప్పి యోగి వెళ్లి పోయాడు
ఒక్క  మంచి  రోజు  వచ్చేదాకా  అగి  ఆనాటి  అర్థరాత్రిపూట  రామలింగం  ఒంటరిగా  కాళకా  దేవి  గుడికి  వెళ్లి   యోగి  చేప్పిన  మాత్ర0  వేయి సార్లు  జపించాడు.  కాళికా  దేవి  వెంటనే  వేయి   తలలుతో  ప్రత్యక్షమై0ది.  రామ లింగం  బయపడలేదు.  ఆతనికి ఏమి తోచిందో ఏమో  హక్కున్న  నవ్వాడు. దేవి  రామలింగాని "ఎందుకు అబ్బాయీ, నవ్వుతా?" వని  అడిగింది. 

"మీరు   కోపగించుకోమంటే  మనవి   చేసుకుంటాను,"  అన్నాడు   జంకు   గొంకూ  లేకుండా   రామలింగం. దేవి  సరేన్నది. రామలింగం అపుడు చెప్పాడు:--------

"అమ్మా! మాకూ  ఒక్కటే  ముక్కు, కాని రెండు చేతులున్నాయి. ఎప్పుడన్నా జలుబు  చేస్తే  ఈ  ఒకముక్కు  చిదుకోవటానికే  రెండుచేతులు చాలటంలేదు.  ఇక  మీకా వేయితలలు.  కర్మజాలక జలుబు చేస్తే  ఆ  వేయిముకలు  చీదుకోవటానికి  ఈ  రెండుచేతులు  ఎలా  చాలుతాయా  అని  నవ్వు  వచ్చింది."  దేవి  కూడా  అతనిమాటకు  నవీ. . . . . . .
Tenali-ramalingadu-with-kalilka-devi.jpeg

"నాయనా, నన్నుచూచి  నవీనవాడివి  ఇక  నువ్వు  ఎవరిని  చూచి  నవ్వవు  గనుక.  నీవు  తప్పకుండా  వికటకవి  వవుతావు,"  అంది. 

రామలింగం  నమస్కరించి  "తల్లి  ఎటుతిప్పి  చదివిన  చెడనిమాట  వరంగా  ఇచ్చావు.  ఇంతకంటే  నాకు  ఏమికావాలి," అన్నాడు. 
vikata-kavi.jpeg

కాళిక  అతన్ని  తెలివి  తేటలకు  మేచికొన్నది.'వికటకవి' అని మాటఎటు  తిప్పిచదివిన    మారేది   ఏమి   ఉంది?  దేవి  సంతోషంతో  ఇంకో  వరం  కూడా  ఇచ్చింది. "నీవు  రాజాస్థానంలో  విదుషా  కూడా  అవుతావు.  అంతే  కాదు.  నీలాగా  పద్యం  చెప్పడం  మరోకరికి  చేతకాదు. "  అని  ఆశీర్వదించింది.

రామలింగం  వికటకవిగా  ప్రసిద్ధి  చెందాడు.  అయినా  పేరుతో    ఎన్నో  హాస్య  కథలు  ఉన్నాయి.  ఇవి  కాక  రెండు  మహాకావ్యాలను  రాసాడు.  ఉద్భటారాధ్య  చరిత్ర  ఒక్కటి,  పాండురంగ   మహిత్యం రెండూ. పెద్దవాళ్ల యి  నాక  మీరు  వాటిని  చదువుతారు  కదూ.  

Thursday, June 6, 2019

Thalli Leni Pilli Kunaa

చందమామ కథలు 


తల్లి లేని పిల్లి కూన

నగా అనగా ఒక ఊరు. ఆ ఊరి బైట వాములదొడ్లో ఒక పిల్లి ఉండేది. దానికో బుల్లి పిల్లికూన పుట్టిoది. పాపం! పిల్లకూనని కన్న వెంటనే ఆ తల్లి చనిపోయిoది. తల్లి లేని పిల్లకూనని పిల్లి భాష తెలియనేలేదు.
 Thalli-leeni-Pilli-kunaa.jpeg
పిల్లికూనకి ఆకలివేసింది. పాలు కావాలి, ఎలా అడగాలో తెలియలేదు దానికి. పాపం, ఆకలితో ఆవు రావురు మంటూ పిల్లి కూన వీధిలో పడింది. ఏడుస్తూ నడుస్తోంది. దారిలో దానికొక కుక్కపిల్ల కనబడింది. పిల్లికూనని కుక్కపిల్ల అడిగిందిగదా:
'పిల్లికూనా పిల్లికూనా
గళ్ల  గాళ్ల  పిల్లికూనా
కళ్ల నీళ్లు ఎందుకమ్మా?'
ఏడుస్తూనే అంది పిల్లకున్న:
'కుక్కపిల్ల! కుక్కపిల్ల!
ఒక్క సంగతి చెప్పగలవా?
 ఆకలేస్తే పాలకోసం
అమ్మనేమని అడుగుతావ్?'
కుక్కపిల్ల అంది:
'నేను అరుస్తాను
వసందేనా కుక్కబాషా
  పాలు నీకుకావాలా
అలా అయితే అరిచిచూడు'.
పిల్లికూన అంది:
' భౌ భౌ  మని  అరవలేను
బాగు  లేదు కుక్క భాష
మాతృభాష తప్ప నాకు
మరోభాష వద్దు వద్దు.'
 Thalli-Leni-Pilli-Kunaa.jpeg

అని పిల్లకూన ఆకర్ణించి వెళ్లిపోయింది. దారిలో కోడెదూడ కనబడింది. అడిగితే, అంభో అని అరవమంది. పిల్లినకి కూఆ భాష నచ్చలేదు. కాకిపిల్ల కనపడింది. కా.. కా... అని అరవమంది. కప్ప పిల్ల కనబడింది. బెక బెక మని పిలవమంది. మేకపిల్ల కనబదింది.  మేమే  అని  అరవమంది. పిల్లకున్న ఏడుస్తూ వెళ్లిపోయింది. ఈ భాష లేవీ నాకు వదనుకుంది.
ఆఖరికి ఒక పెద్దపల్లి కనపడింది. ఏడుస్తున్న పిల్లకూనని బుజ్జగించి,
 పిల్లికూనా, పిల్లికూనా
ఎందుకమ్మా ఏడుస్తావ్?'
అని అడిగింది.
'ఆకలేస్తే పాలకోసం
అమ్మ నేమని అడుగుతావ్'
అని అడిగింది పిల్లకూన.
" మ్యాప్ మ్యాప్  మ్యాప్  మ్యాప్ "అని బోధించింది పెద్దపిల్ల.
పిల్లికూనకి తల్లిభాష దొరికింది. మ్యావు మ్యావు మని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్లి. ఆ ఇంట్లో శారదా అనే అమ్మాయి ఉంది. " మ్యాప్  మ్యాప్ " అంది, తల్లిలేని పిల్లికూన. శారద దానిభాష తెలుసుకుంది.
https://storiesblogadda.blogspot.com
"ఓహో! ఆకలేస్తోంది పిల్లికూనా, పాలు తెస్తాను తాగు" అని శారద ఒక గినెలో పాలుపోసి తెచ్చింది. పిల్లికూన సంతోషంతో పాలన్ని తాగింది. తరువాత పిల్లికూన, శారదా చాలా సేపు ఆడుకున్నారు. ఆఖరికి అలసిపోయి శారద నిద్రపోయింది. పిల్లికూన కూడా ఒకమూల హాయిగా నిద్రపోయింది. ఇక కథ కంచికి, మనం ఇంటికి.  

Monday, June 3, 2019

Gajendra Moksham

మహా భాగవతం 


గజేంద్రమోక్షము


గజేంద్రుడు తన పూర్వ జన్మలో మహా ఘన వైష్ణవుడైన ఇంద్రద్యుమ్నుడు. అతడు పాంఢ్య దేశానికి రాజుగా ఉండేవాడు. రాజ్య పరిపాలనను పూర్తి చేసిన తరువాత  ఇంద్రద్యుమ్నుడు వానప్రస్థాన్ని స్వీకరించి మలయచలానికి వెళ్లి ఒక పర్ణసాలలో నివసించాడు. ఒక రోజు దేవుని ఆరాధనలో నిలిచిన  ఇంద్రద్యుమ్నుడు తరచుగా ధ్యానమగ్నుడై ఉండేవాడు .ఒక సారి అతడు పూర్తిగా  సమాధిమగ్నుడై ఉన్న సమయం లో అగస్త్యముని శిష్యసమేతంగా అక్కడకు వచ్చాడు .తనకు సత్కారాలు చేయకపోవడం చూసి క్రుద్దుడై "బ్రాహ్మణుని అవమానించాడు కాబట్టి జడబుద్ధి కలిగిన గజదేహము కలుగుగాక !"  అని తీవ్రంగా శపించాడు . 

ఏనుగుకు ఎంత శారీరక బలం ఉన్నా బుద్ధిబలం లేకపోవడం వలన మనిషికి లొంగిపోయి ఉంటుంది.  ఇంద్రద్యుమ్నుడు భక్తుడు కాబట్టి జరిగినదంతా భాగవద్ లీలా గ భావించాడు. తదుపరి జన్మ లో ఏనుగుగా పుటినప్పటికీ భగవత్ నామాన్ని మరువలేదు. గజేంద్రుడు త్రికూట పర్వత అరణ్యాలలో తన పరిజనులతో నివసించేది.  రమ్యమైన ఆ ప్రాంతములో ఒక మనోహరమైన మహాసరోవరము ఉన్నది .అది పుష్పభరితమై ఉండేది .ఆ సరోవరంలో హంసలు, చక్రవాకాలు ,నీటికోళ్ళు, వంటి ఎన్నో జలజంతువులు ఉండేవి . 
గజేంద్రమోక్షము.jpeg

ఒక రోజు గజేంద్రుడు తన   పరిజనులతో కలసి  సరోవరానికి వెళ్ళింది .. తన పరిజనులతో స్నానం చేస్తుండగా విధివశాత్తు ఒక భయంకరమైన మొసలి దాని కాలును పట్టుకొంది.  గజేంద్రుడు  మొసలితో పోరాడడం మొదలు పెట్టాడు.  మొసలి  గజేంద్రుడుని  నీటిలోకి లాకొని పోవాలి అని , గజేంద్రుడు మొసలిని ఒడ్డుకి ఈడ్చుకోరావాలిఅని 

ఇలా 1000 సవత్సరాలు యుద్ధం చేసుకున్నాయి . గజేంద్రుడి  పరిజనులు ఏమిచేయలేక  చుస్తూ  వుండిపోయారు . ఇక చేసేది ఏమి లేక ఆ దేవదేవుడిని స్తుతించాడు . "అన్ని జీవులకి సృష్టికర్త, నియంత్రిచగల ,శక్తి కేవలం ఆ దేవదేవునికి తప్పా మరి ఎవరికీ లేదు ",కాబట్టి ఆ దేవదేవుడే నన్ను రక్షించగలడు అని "జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం"  గజేంద్రుడు జపించడం  మొదలుపెట్టింది ..

దేవదేవుడు  కరుణామయుడు భక్తితో అర్తిస్తే ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాడు గజేంద్రుని  శరణు విని దేవదేవుడు శంకచక్రగదాధారిని ధరించి పక్షి రాజైన గరుడారూఢుడై  భగవంతుడు  గజేంద్రుని ముందు ప్రత్యేక్షమైయ్యాడు . గరుడవాహనంఫై తనను రక్షించడానికి చక్రధారి అయినా నారాయణుడు ఆకాశం లో దర్శనమివ్వగానే  గజేంద్రుడు తొడముతో ఒక పద్మమును పైకెత్తి సమర్పిస్తూ "నారాయణా !దేవదేవా !జగన్నాథా !ఇదే నీకు నా  వందనలు " అని గొంతెత్తి పలికింది.
నారాయణా !దేవదేవా !జగన్నాథా !ఇదే నీకు నా  వందనలు .jpeg

తన భక్తునికి కలిగిన కష్టాన్ని భగవంతుడు చూసి శీఘ్రమే మొసలితోపాటు  గజేంద్రున్ని   ఒడ్డు పైకి లాగి అందరి సమక్షంలో  చక్రాయుద్ధంతో మొసలిని ఖండించాడు .    గజేంద్రుము కష్టం నుండి బయటపడింది .   గజేంద్రరక్షణాన్ని చూసి సమస్త జగత్తు పులకించింది .పూర్వం మొసలి హుహు అనే గంధర్వుడు  ఋషి శాపం వల్ల మొసలిగా మారి ఆ సరోవరం లో నివసించ సాగేది, విధివశాత్తూ  దేవదేవుని చక్రస్పర్శ కి గురైయింది.  
దేవదేవుని చక్రస్పర్శ వలన మొసలి తన పూర్వ దేహాన్ని పొంది  గంధర్వలోకానికి  వెళ్ళింది.jpeg

దేవదేవుని చక్రస్పర్శ వలన మొసలి తన పూర్వ దేహాన్ని పొంది  గంధర్వలోకానికి  వెళ్ళింది .గజేంద్రుడు కి  దేవదేవుని స్పర్శ వల్ల ఆధ్యాత్మిక దేహం లభించింది . ఆధ్యాత్మిక దేహం పొందిన తరువాత విగ్రహారాధన వల్ల గోలోకానికి చేరుకొన్నాడు .

"భగవంతుడిని భక్తి తో అర్చిస్తే ఏ రూపం లోనైనా ఆపదల నుంచి ఆదుకుంటాడు అనడానికి నిదర్శనం ఈ గజేంద్రమోక్షము".

Sunday, June 2, 2019

జిత్తుల మారి నక్క బావ

 చందమామ కథలు 


జిత్తుల మారి నక్క బావ 


నగనగ  ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాల జిత్తులమారిది. అది ఎక్కడినుంచి వచ్చిందో ఎప్పుదు వచ్చిందో ఎవరికీ తెలియదు. దానితరహా అంత చిత్రంగా  ఉండేది. అందుకని మిగతా నక్కలు అన్ని "నువు మా కులముదానివేకాద పో ". దానితో మాట్లాడటంకూడా మాని వేసినై.

ఇక నక్క ఏమిచేస్తుంది? అక్కడ తన ఆటలు సాగకపోయేవరకు అడవికి దగ్గరగా ఉన్న ఊరు పోయి అక్కడ మంగళివానితో స్నేహం చేసుకున్నది. పాపం, ఆ మంగలి చాలా మంచిది. అతనికి ఈ నక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్దమనిషి లాగా తియ్యతియ్యగా మాట్లాడేది. అది నిజమని మంగలి నమ్మాడు. వాళిద్దరికి మంచి స్నేహం కలిసింది. ఒకనాడు నక్క మంగలితో అన్నది కదా "మంగలి మామా, మంగలి మామా! మనం పళ్లతోట వేసుకుంటే ఎట్లా ఉంటుంది? మనం తిన్నని తినవచ్చు, మిగతావి  అమ్ముకుని పొది నిండా డబ్బులు  పోసుకోవచ్చు".

జిత్తులమారి నక్క .jpeg

పాపం  మంగిలికి ఈ మాటలు వీనేసారికి  నోరు పూరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోటవేశాడు. అక్కడ గుమ్మడిపాడులు, దోసపాదులూ పెట్టాడు. తనూ పెళము కలిసి పాదులు చేసి, నీళ్లు తెచ్చి, చెట్లకు పోసేవాళ్లు. నక్క పై కర్రపెత్తనం చేస్తూ కావిలి కాస్తున్నానానేది.

కొన్నాళ్లకి తోట కాపుకు వచ్చింది. నక్క రాత్రి అంత మేలుకొని కడుపు ఉబేదాకా, పళ్లు కాయలు మెకేది. ఒకపండు కాయ కనపడనిచ్చేది కాదు.

ఒకనాడు మంగలి "నక్క బావా, నక్క బావా! తోటలో కాయాలేమైనా ఉన్నయా?"అని ఆడిగాడు. "ఇపుడెక్కడివి? వానాకాలం వస్తేగా దొరికేది?" అన్నది నక్క. పాపం, మంగలి నమ్మాడు. వానకాలంవచ్చినాక అడిగాడు. "వానాకాలంలో ఎక్కడన్నా కాయలు ఉంటాయీ? చలికాలం రావాలి" అన్నది. చలికాలంలో కాయలు దొరుకుతాయా, పిందెలు ఉంటాయి. ఎండాకాలంలో అడుగు," అని ఇట్లా ఏదో ఒకసాకు చెపుతూ మంగలిని ఒక కాయ తిననివ్వలేదు. ఇంతలో ఎండా కాలం వచ్చింది. కాయలు కాచినై. నక్క ఒకనాటి రాత్రి అడవికిపోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటినన్నిటిని విందుకు పిలిచింది. అవి వచ్చి, పోటా పటినని తిని, మిగతావి తుంచి, కొబారి, మట్టిలో పారవేసిపోయి చకా పండుకొన్నవి.


పాపం, మర్నాడు పొద్దున మంగలి వచ్చి తోట చూసుకుంటే కాళ్ళ వెంబడి నీళ్లు వచ్చినై, చెట్లని ఒక కాయ లేదు. ఒకమూలనుమాత్రం గుమ్మడి పాడుకు ఒక గుమ్మడికాయ ఉంది. అదీ ఆకులు కమిఉండటం మూలాన కనపడటంలేదు. నక్క చేసిన మోసానికి దాన్ని డాందించాలి అని అనుకున్నాడు మంగిలి. ఇంట్లోకిపోయి పొదిలి నుంచి మంగిలి కత్తులు తీసి బాగా సానపెట్టి గుమ్మడి కాయకి చుటూ కట్టాడు. ఆ కత్తులు కనపడకుండా ఆకులు అడ్డం పెట్టి, ఇంటికిపోయి హాయిగా నిద్రపోయాడు.

తోటలో కాయలన్ని తోటినక్కాలి అదివరకే పాడుచేసినై.jpeg


మర్నాడు రాత్రి తీరిగ్గా నక్క వచ్చింది. దానికి బాగా ఆకలి వేస్తున్నది. తోటలో కాయలన్ని తోటినక్కాలి అదివరకే పాడుచేసినై. తోట అంతా గాలించటం మొదలుపెటింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనపడింది. అది అతి ఆశతో ఒక్కమాటుగా గుమ్మడికాయ మీద దూకింది,  ఇంకేం, దానివోలంతా తెగింది.  నెత్తురు కరాటం మొదలుపెటింది. వొలంతామంటలు. ఏడుచుకుంటూ, కలుచుకుంటూ పోయి ఒక రాతిమీద కూర్చున్నది. చాలా సేపటిదాకా నెత్తురు కారిపోతూనే ఉన్నది. ఇక ఇలాంటి తాపుడిపని చెయ్యకూడదని మనసులోకున్నది. మంగలిని దొంగ అని తిటింది. ఎన్ని సార్లు  అరిచినా, ఎవరిని తిట్టిన  దానినోపి  తగ్గుతుందా? నెత్తురు కారటం ఆగినతరువాత బయలుదేరుదాం అనుకున్నాది.


కాని ఆ నెత్తురు ఎండి గడకటి అందులో ఇరుక్కుపోయింది. అందులోంచి కదలలేదు, మెదలలేదు, నక్కకి మంగలిమీద భలేకోపం వచ్చింది. "నన్ను ఇందులోనుంచి బయటికిరానియ్య విడిపని చూడకపోతేయ్!" అని శపధం చేసింది.


పాపం! ముందు ఇది బయటపడితే కదా మంగలిపని పట్టటానికి. అబ్బాయిలు మనంకూడా చూద్దాము ,నక్క వాడిపని ఎట్లపట్టుతుందో !