Friday, May 31, 2019

Lord Puri Jaganatha Temple Mystry

జగన్నాథ లీలలు 
Part-1

పూరి జగన్నాథ ఆలయ రహాసం

సంస్కృత భాషలో "జగత్" అంటే  విశ్వము , "నాథ్"  అంటే  ప్రభువు. దీనిని బట్టి "జగన్నాథ్" అనే పదానికి విశ్వానికి ప్రభువని అర్థం . జగన్నాథుడు  సాక్షాత్తుగ శ్రీ కృష్ణుడే . ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పూరీ  జగన్నాథ మందిరాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించాడు . జగన్నాథుడు  గిరిజనుల  దేవుడని ,నీలామాధవుడనే  పేరుతో పూజలను  అందుకుంటున్నాడని స్థలపురాణం చెబుతోంది.
Neelamadavadu-Girijanula-Raju.jpeg
                                             
నీలాచల పర్వత అడవులలోని ఒక రహస్యస్థానంలో ఉన్న నీలమాధవుని గిరిజనుల రాజైన విశ్వావసువు పూజించేవాడు. భగవంతుని ముఖాముఖీ చూడాలనే జీవితలక్ష్యం కలిగిన ఇంద్రద్యుమ్నడు విద్యాపతి అనే బ్రాహ్మణుడిని నీలామాధవుని దర్శనానికి పంపాడు . 
Vidyapathi-and-Lalitha.jpeg
అయితే విద్యాపతి విశ్వావసువు కుమార్తె లలితను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు .తరువాత తన భార్య ద్వారా సిఫార్సు చేయించుకొని విద్యావతి విశ్వావసువుతో పాటుగా నీలమాధవుని దర్శనానికి వెళతాడు .కానీ విశ్వావసువు తన అల్లుడి కి కళ్ళ గంతలు కట్టి నీలమాధవుడు ఉండే స్థలానికి తీసుకొని వెళతాడు .అయితే విద్యాపతి కాస్త తెలివిగా పనిచేసి దారిపొడవునా ఆవాలు పోసుకుంటూ  పోయాడు .దానితో కొన్ని రోజులకు  ఆ  దారిలో ఆవ మొక్కలు వచ్చాయి .
Aswameeda-Yagam.jpeg
అప్పుడు విద్యాపతి ఇంద్రద్యుమ్న మహారాజును పిలిపిస్తాడు .ఆ ఆవమొక్కలే  ఇంద్రద్యుమ్న మహారాజుకు దారి చూపించేవిగా అయ్యాయి . కానీ ఇంద్రద్యుమ్నుడు ఆ ప్రదేశానికి చేరే లోపలే నీలమాధవుడు అదృశ్యమయ్యాడు .అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు అనేక అశ్వమేధ యజ్ఞాలు చేసాడు .నీలాచలంలో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో శ్రీ నృశింహస్వామిని ప్రతిష్టించాడు .
kooyadungalu .jpeg

తరువాత జగన్నాథుడు ఆ రాజు కలలో కనిపించి అతి త్వరలో కొన్ని కొయ్యదుంగలు లభిస్తాయి ,వాటితో తన శ్రీవిగ్రహాలను తయారు చేయించమని ఆదేశించాడు .అప్పుడు శ్రీ విగ్రహాలను చెక్కడానికి శిల్పులే  ముందుకు రాలేదు .ఆ సమయంలో విస్వకర్మయే వృద్ధ బ్రాహ్మణుని రూపంలో అక్కడకు  వచ్చి శ్రీ విగ్రహాలను  చెక్కే   బాధ్యతను తీసుకున్నాడు .

Viswakarma.jpeg
Making-Process-of-Idols.jpeg

అయితే తాను  తలుపులు మూసేసిన గదిలో శ్రీవిగ్రహాలను చెక్కుతానని ,ఆ కార్యానికి 21 రోజులు పడుతుందని ,మధ్యలో ఎవ్వరు తలుపులు తీసి లోపలికి రాకూడదని శిల్పి నిబంధనలు చెప్తాడు .గది నుండి శబ్దం వినపడకపోయేసరికి గడువు పూర్తి కాకనే రాణి గుండిచదేవి తొందర పెట్టడంతో ఇంద్రద్యుమ్న మహారాజు తలపులు తెరవడం వలన కేవలం సగం చెక్కిన శ్రీమూర్తులే కనిపించాయి .
Raja-See-the-process-of-making-idols.jpeg
                                                
Original-Image-of-Lord-jaganatha.jpeg
అప్పుడే బ్రహ్మ దేవుని చేతుల మీదుగా మందిరం లో శ్రీజగనాథుని ప్రతిష్టించడం  జరిగింది .చతుర్దశ భువనాలను ,భక్తులను కాపాడడానికే అన్నట్లు శ్రీజగనాథునికి పెధ్ద పెద్ద చక్రాల వంటి కళ్ళు ఉండటం విశేషం .స్కంద పురాణం ప్రకారం జగనాథుడే పురుషోత్తముడు .అందుకే ఈ క్షేత్రాన్ని "పురుషోత్తమక్షేత్రము "అంటారు .
Temple-of-puri-Jaganath.jpeg
 దీనికే శ్రీ క్షేత్రము , నీలాచల క్షేత్రమనే పేర్లు కూడ ఉన్నాయి. శ్రీ జగన్నా థునికే   "పతితపావన" అనే పేరు ఉంది .అంటే శ్రీజగనాథుడు పతితులైన వారికి పరమ బాంధవుడని అర్థం .