చందమామ కథలు
తల్లి లేని పిల్లి కూన
ఆనగా అనగా ఒక ఊరు. ఆ ఊరి బైట వాములదొడ్లో ఒక పిల్లి ఉండేది. దానికో బుల్లి పిల్లికూన పుట్టిoది. పాపం! పిల్లకూనని కన్న వెంటనే ఆ తల్లి చనిపోయిoది. తల్లి లేని పిల్లకూనని పిల్లి భాష తెలియనేలేదు.
పిల్లికూనకి ఆకలివేసింది. పాలు కావాలి, ఎలా అడగాలో తెలియలేదు దానికి. పాపం, ఆకలితో ఆవు రావురు మంటూ పిల్లి కూన వీధిలో పడింది. ఏడుస్తూ నడుస్తోంది. దారిలో దానికొక కుక్కపిల్ల కనబడింది. పిల్లికూనని కుక్కపిల్ల అడిగిందిగదా:
'పిల్లికూనా పిల్లికూనా
గళ్ల గాళ్ల పిల్లికూనా
కళ్ల నీళ్లు ఎందుకమ్మా?'
ఏడుస్తూనే అంది పిల్లకున్న:
'కుక్కపిల్ల! కుక్కపిల్ల!
ఒక్క సంగతి చెప్పగలవా?
ఆకలేస్తే పాలకోసం
అమ్మనేమని అడుగుతావ్?'
కుక్కపిల్ల అంది:
'నేను అరుస్తాను
వసందేనా కుక్కబాషా
పాలు నీకుకావాలా
అలా అయితే అరిచిచూడు'.
పిల్లికూన అంది:
' భౌ భౌ మని అరవలేను
బాగు లేదు కుక్క భాష
మాతృభాష తప్ప నాకు
మరోభాష వద్దు వద్దు.'
అని పిల్లకూన ఆకర్ణించి వెళ్లిపోయింది. దారిలో కోడెదూడ కనబడింది. అడిగితే, అంభో అని అరవమంది. పిల్లినకి కూఆ భాష నచ్చలేదు. కాకిపిల్ల కనపడింది. కా.. కా... అని అరవమంది. కప్ప పిల్ల కనబడింది. బెక బెక మని పిలవమంది. మేకపిల్ల కనబదింది. మేమే అని అరవమంది. పిల్లకున్న ఏడుస్తూ వెళ్లిపోయింది. ఈ భాష లేవీ నాకు వదనుకుంది.
ఆఖరికి ఒక పెద్దపల్లి కనపడింది. ఏడుస్తున్న పిల్లకూనని బుజ్జగించి,
పిల్లికూనా, పిల్లికూనా
ఎందుకమ్మా ఏడుస్తావ్?'
అని అడిగింది.
'ఆకలేస్తే పాలకోసం
అమ్మ నేమని అడుగుతావ్'
అని అడిగింది పిల్లకూన.
" మ్యాప్ మ్యాప్ మ్యాప్ మ్యాప్ "అని బోధించింది పెద్దపిల్ల.
పిల్లికూనకి తల్లిభాష దొరికింది. మ్యావు మ్యావు మని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్లి. ఆ ఇంట్లో శారదా అనే అమ్మాయి ఉంది. " మ్యాప్ మ్యాప్ " అంది, తల్లిలేని పిల్లికూన. శారద దానిభాష తెలుసుకుంది.



Super story
ReplyDeletethanks alot....
ReplyDelete